కన్యకా పరమేశ్వరీ దేవాలయం లొ

సరస్వతీ దేవి అవతారం లొ…
మిర్యాలగూడ, జనం సాక్షి
శ్రీ వాసవీ కన్యాకాపరమేశ్వరి దేవాలయం లో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం సరస్వతి దేవీ అవతారం లో శ్రీ కన్యాకాపరమేశ్వరి అమ్మ వారు దర్శనమిచ్చారు.ఉదయం 10 గంటలనుండి మూలానక్షత్ర పర్వదిన సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులచే సామూహిక సరస్వతి పూజ నిర్వహించారు. అనంతరం రైస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్ణాటక రమేష్ దంపతులు, ప్రముఖ రైస్ మిల్లర్ డాక్టర్ బండారు కుశలయ్య దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.