కబళిస్తున్న ప్లాస్టిక్‌ భూతం 

అనారోగ్యం బారిన పడతున్న ప్రజలు
ప్లాస్టిక్ మయమైన ఆహార పదార్ధాలు
 మేల్కోనక పోతే అనర్థమే
మహబుబ్ నగర్ 18ఫిబ్రవరి.(జనం సాక్షి బ్యురొ) ప్రజల నిత్యావసరానికి ఆహార పదార్ధాలు తీసుకోవటానికి విరివీగా ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారు .ముఖ్యం గా కరిష్ సెంటర్లలో వేడి పదార్థాలు ఈ ప్లాస్టిక్ కవర్ లో నింపి విక్రయిస్తున్నారు. దానివలన తినుబండారాలు విషతుల్యంగా మారి ప్రజల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు చర్యలు తీసుకోవడంలో విపలమవుతున్నారు .నిరంతర నిఘా పర్యవేక్షణ లేకపోవటం తో అనర్థం జరుగుతుంది.
రంగులతో ప్రమాదం:
బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌)’ సూచించిన విధంగా నాణ్యతా ప్రమాణాలతో తయారు చేసిన ప్లాస్టిక్‌ వస్తువు అయితే కొంతమేరకు ఫరవాలేదు. ఈ వస్తువుల్లో హానికారక రసాయనాలు తక్కువ మోతాదులో ఉంటాయి. వీటి కింది భాగంలో ‘ఇది ఆహార పదార్థాల కోసమే తయారుచేసినది’ అని పేర్కొంటూ ‘బీఐఎస్‌’ ధ్రువీకరించిన ముద్రణ ఉంటుంది. ఇక ప్లాస్టిక్‌ చేతి సంచుల్లో కనీసం 50 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న సంచులను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే విపణిలో ఈ ఆదేశాలు అమలు కావడంలేదు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌లో కొన్ని ఊరుపేరు లేని కంపెనీల నీళ్ల సీసాలను కూడా విక్రయిస్తున్నారు.
ప్లాస్టిక్‌ వస్తువుల్లోని హానికారకాలు
* ప్లాస్టిక్‌ పరమాణువులు
* సీసం
* క్యాడ్మియం
* థాలేట్‌
* మెర్క్యూరీ (పాదరసం)
తలెత్తే అనారోగ్య సమస్యలివే..
* కేన్సర్‌
* పుట్టుకతో అవకరాలు
* దీర్ఘకాలిక బ్రాంకైటిస్‌
* అల్సర్లు
* కాలేయం దెబ్బతినడం
* ఎండోక్రైన్‌ వ్యవస్థ దెబ్బతినడం
* పునరుత్పత్తి వ్యవస్థపై దుష్ప్రభావం
* సంతానలేమి
* రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతినడం
* యుక్తవయసులోనే ఊబకాయం
త్వరలో నిషేధించనున్నవి
* 200 ఎంఎల్‌ నీళ్ల సీసాలు
* ప్లాస్టిక్‌ మినరల్‌ వాటర్‌ ప్యాకెట్లు.
* అన్ని రకాల ప్లాస్టిక్‌ చేతి సంచులు, నాన్‌ ఓవన్‌  బ్యాగులు.
* ఒకసారి వినియోగించి పారవేసే అన్ని రకాల ప్లాస్టిక్‌ వస్తువులు.
* ప్లాస్టిక్‌, థర్మాకోల్‌తో చేసే అలంకృత సామాగ్రి.
ప్రభుత్వం ఈ ప్లాస్టిక్ ఉత్పత్తిదారుల పై నిరంతర నిఘా వేసి నిభంధనలకు విరుద్దంగా వ్యవహరిస్టున్న వారిపై కఠీ న చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.