కబేళాకు గోవుల తరలింపును అడ్డుకున్న భజరంగ్‌దళ్ కార్యకర్తలు
కుత్బుల్లాపూర్: గోవులను కబేళాకు తరలిస్తున్న వారిని అడ్డుకుని హిందూ వాహిని, భజరంగదశ్ కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రాంతం నుంచి రెండు డీసీఎం వాహనాల్లో 35 పశువులను ఎర్రగడ్డ సంతకు తరలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సూరారం కాలనీకు చెందిన భజరంగదశ్, హిందూ వాహిని కార్యకర్తలు షాపూర్‌నగర్ వద్ద వాహనాలను అడ్డుకుని జీడిమెట్ల పోలీసులకు అప్పగించారు. తూప్రాన్ ప్రాంతానికి చెందిన సలీం(24), శివం పేటకు చెందిన షాబుద్దీన్ (21)లు పశువులను తరలిస్తున్నట్లుగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపారు.