కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నర్సాపూర్ తాసిల్దార్ ఆంజనేయులు హెచ్చరించారు. మంగళవారం నాడు నర్సాపూర్ పట్టణంలోని ఇరిగేషన్ స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు, ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి ఆక్రమణ కు గురైన స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్థలా౦ ఆక్రమణకు గురై అందులో కడిలాను పాతడం తో సిబ్బంది తో కలిసి కడిలను తొలగించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ ఈ ఈ శ్రీనివాస్ ఏఈ మణిభూషణ్ తో కలిసి మాట్లాడుతూ నర్సాపూర్ పట్టణము లోని 79 సర్వే నెంబరు ఇరిగేషన్ శాఖకు మూడు ఎకరాల 26 గుంటలు ఉందని అందులో కొంత భూమిని కొంత మంది ఆక్రమించి ఏర్పాటు చేసిన ఖడీలను తొలగించి స్వాధీనం చేసుకున్న ట్లు తెలిపారు. ప్రభుత్వ భూముల జోలికొస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని వారు హెచ్చరించారు. ఇదే విషయమై మున్సిపల్ వైస్ ఛైర్మన్ నహీం, కౌన్సిలర్అశోక్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్, పట్టణ అధ్యక్షులు బిక్షపతితో కలిసి ప్రభుత్వ భూముల ఆక్రమణ తహశీల్దార్ ఆంజనేయులు కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సాపూర్ పట్టణంలో కోట్లాది విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రాత్రి వేళల్లో కుంటలు, గుట్టల నుంచి అక్రమంగా మట్టి తవ్వకాలు రాత్రి వేళలో జోరుగా సాగుతున్నాయని వాటిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
కార్యక్రమంలో సీఐ షేక్ లాల్ మదర్, ఎస్సై శ్రీనివాస్, డిప్యూటీ ఎమ్మార్వో నవీన్, ఆర్ ఐ షరీఫ్ రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.