కమాండ్ కంట్రోల్ సెంటర్ సంకల్ప బలానికి ప్రతీక
ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో అద్భుతాలు సాధించాం
నేరాల అదుపులో పోలీసులు మరింత పురోగమించాలి
సంస్కారవంతమైన పోలీస్ వ్యవస్థ నిర్మాణం కావాలి
డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ కోసం కృషి సాగాలి
ఎనిమిదేళ్లుగా శాంతిభద్రతలకు నిలయంగా మారిన రాష్ట్రం
సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిఎం కెసిఆర్
హైదరాబాద్,అగస్టు4(జనం సాక్షి): హైదరాబాద్ నడిబొడ్డున పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నెలకొల్పడం ప్రభుత్వ సంకల్ప బలానికి ప్రతీక అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ రావాలని చెప్తూ వచ్చానని, అది నెరవేరిం దన్నారు. మరో చిన్న కోరిక ఉందని, సంస్కారవంతమైన పోలీసు వ్యవస్థ నిర్మాణం కావాలన్నారు. దేశానికే ఆదర్శంగా నిలవాలి. ఎంత చదువుకున్నా సంస్కారం లేకపోతే కష్టం అన్నారు. హైదరాబాద్‌లో ఇంత మంచి కమాండ్ కంట్రోల్ సెంటర్ వస్తదని ఎవరూ ఊహించి ఉండరు. సంకల్పంతో దీన్ని నిర్మించాం. ఈ ఫలితం మన కండ్ల ముందు నిలబడి నిలువెత్తు సాక్ష్యం ఇస్తుందన్నారు. . ఇప్పుడు దాని ముందు మాట్లాడుతున్నాం. కమాండ్ కంట్రోల్ సెంటర్ సంకల్ప బలానికి ప్రతీకగా అభివర్ణించారు. బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. చిత్తశుద్ధితో చాలా చేశాం. గుడుంబా నిర్మూలన కోసం అనేక చర్యలు తీసుకున్నాం. పేకాట క్లబ్బులను మూసివేశాం. గతంలో పేటకో క్లబ్ ఉండేది. రాబోయే రోజుల్లో పోలీసులు మరింత చురుకుగా పని చేయాలి. మంచిని సాధించడానికి మంచి సంకల్పంతో పని చేస్తే సత్ఫలితాలు వస్తాయన్నారు. తెలంగాణ పోలీసు శాఖ అద్భుత ఫలితాలు సాధించాలి. ప్రజలకు సేవ అందించే సంస్థ కావాలి. సంస్కారవంతమైన పోలీసుగా తయారు కావాలి. ఆ విధంగా పురోగమించాలి. పెద్దల సలహాలు కూడా తీసుకోవాలి. గతంలో పని చేసిన పోలీసు కమిషనర్లు హైదరాబాద్‌కు గొప్ప సేవలందించారని సీఎం కేసీఆర్ కొనియాడారు. గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రం అశాంతికి లోనుకాకుండా శాంతిభద్రతల నిలయంగా ముందుకు సాగుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో చాలా నేరాలు తగ్గాయని చెప్పారు. కమాండ్ కంట్రోల్ సపోర్ట్‌తో పోలీసులు మంచి ఫలితాలు సాధిస్తారనిఆశిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సిన అవసరం వుందని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ తో పాటు
రాష్ట్రంలో సంస్కారవంతమైన పోలీసింగ్ రావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. పోలీసులకు ఎటువంటి సహకారం కావాలన్న అందిస్తానని వెల్లడిరచారు. నేరగాళ్లు రూపాలు మారుస్తున్నారన్న సీఎం.. ప్రపంచాన్ని గందరగోళ పరుస్తోన్న అంశం సైబర్ కైర్ర అని చెప్పారు. సైబర్ కైర్ర ఒక క్రిటికల్ అంశమని..డీజీ లేదా అడీషనల్ డీజీని పెట్టి వాటిపై ఫోకస్ పెట్టాలని సూచించారు. విదేశాల్లో సైబర్ కైమ్ర్ పై ఎటువంటి విధానం ఉందో తెలుసుకోవాలని సూచించారు. భవిష్యత్ తరాల బంగారు భవితను నాశనం చేసే డ్రగ్స్ కట్టడికి పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. డ్రగ్ ఫ్రీ స్టేట్ గా తెలంగాణను తీర్చిదిద్దాలని చెప్పారు. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో డ్రగ్స్ వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని..అయితే అక్కడి అధికారుల చర్యల వల్ల అది అంతమైందని చెప్పారు. రాష్ట్రంలో కూడా అటువంటి చర్యలు తీసుకుని డ్రగ్స్ ను అరికట్టాలని కేసీఆర్ సూచించారు. ఈ కార్యక్రమంలో
మంత్రులు మహ్మూద్ అలీ,వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, సిపి సివి ఆనంద్ ఇతరపోలీస్ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.