కమీషనర్ ఆఫ్ ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్ జీవన్ లాల్ ను సన్మానించిన జర్నలిస్టులు
జూలూరుపాడు, జూలై 27, జనంసాక్షి: ఆదాయపన్ను శాఖ నేర పరిశోధన విభాగంలో తెలుగు రాష్ట్రాల పరిధిలో అడిషనల్ కమిషనరుగా పని చేస్తున్న లావుడియా జీవన్ లాల్ (ఐఆర్ఎస్) ఇటీవల కమిషనర్ గా పదోన్నతి లభించటం పట్ల సీనియర్ జర్నలిస్టులు కొలిపాక చంద్రశేఖర్, మోదుగు ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం హైదరాబాద్ లోని ఆదాయపన్ను శాఖ కార్యాలయంలో జీవన్ లాల్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. మారుమూల పల్లె నుండి ఉన్నత స్థాయికి చేరుకున్న జీవన్ లాల్ ను శాలువా కప్పి గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ లావుడియా జీవన్ లాల్ ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. జర్నలిస్టుల తోపాటు దళిత సంఘాల నాయకులు మోదుగు సుగుణరావు, ఉబ్బపల్లి సంజీవరావు జీవన్ లాల్ కు పూల బొకేలు అందించారు. ఉద్యోగ రంగంలోనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో జీవన్ లాల్ ముందుండి పనిచేస్తున్నారని అన్నారు. కష్టాలు, సమస్యల్లో ఉన్న పేదలకు చేయూతనిస్తున్న జీవన్ లాల్ ఉద్యోగ ఉన్నతి పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మోదుగు ఉదయ్ కుమార్, మెన్కోలియ సాగర్, మోదుగు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.