*కమ్యూనిస్టులను విమర్శిస్తే ఖబర్దార్ …
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెప్పుల దండతో ఊరేగింపు, దిష్టిబొమ్మ దగ్ధం*
కరీంనగర్ టౌన్ అక్టోబర్ 9(జనం సాక్షి)
ఆదివారం కరీం నగర్ లో ని తెలంగాణ చౌక వద్ద సిపిఎం,సిపిఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో కమ్యూనిస్టులపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన అనుచిత వాక్యాలను ఖండిస్తూ… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బొమ్మకి చెప్పుల దండ వేసి ఊరేగిస్తూ,దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది*
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి, సిపిఐ రాష్ట్ర నాయకులు పొన్నగంటి కేదారి మాట్లాడుతూ… మునుగోడులో తమ స్వార్థ ప్రయోజనాల కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 20 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు కోసం అమ్ముడుపోయారని,తాను అమ్ముడుపోయి మునుగోడులో కమ్యూనిస్టులు అమ్ముడు పోయారు అనడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలు ఆశీర్వదించి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపిస్తే,ప్రజా తీర్పును అగౌరపరుస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని అన్నారు.
మునుగోడులో కమ్యూనిస్టులు పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి ప్రజలకు నష్టం చేసే మతోన్మాద బీజేపీ గెలిచే ప్రమాదం ఉందనే, ప్రజల కోసం నిస్వార్ధంగా వామపక్షాలు పోటీ చేయకుండా ఉన్నాయని నీలాగా డబ్బుల కోసం కక్కుర్తి పడి అమ్ముడు పోలేదని గుర్తు చేశారు.
భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో కమ్యూనిస్టులు ముందుండి ప్రజల కోసమే పోరాడారని,వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అనేకమంది అసువులు బాసి,లక్షలాది ఎకరాలు ప్రజలకు పంచారని, బ్రిటిష్, నైజాం,నవాబ్ లని తన్ని,తరిమి ప్రజలకు విముక్తి చేసిన చరిత్ర కమ్యూనిస్టులదని అన్నారు.
మీలాగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనని మతోన్మాద బిజెపి, ఆర్ఎస్ఎస్ అడుగులకు మడుగులోత్తుతు,డబ్బుల కోసం అమ్ముడు పోయే రకం కాదని అన్నారు. కమ్యూనిస్టులను విమర్శిస్తే సూర్యుని మీద ఉమ్మివేసినట్లేనని ఆగ్రహించారు.
ED,సీబిఐ భయపడి,ధనార్జనే ధ్యేయంగా,పనిచేస్తు,స్వార్థ రాజకీయాలు మానుకోకపోతే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుడికందుల సత్యం,గీట్ల ముకుంద రెడ్డి,సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా నాయకులు, కిన్నెర మల్లమ్మ,బుచ్చన్న యాదవ్,సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు U.శ్రీనివాస్,డి. నరేష్ పటేల్,తిప్పారపు సురేష్,సిపిఎం నగర నాయకులు కొంపల్లి సాగర్,పుల్లెల మల్లయ్య,పున్నం రవి నాయకులు, కసిరెడ్డి మణికంఠ రెడ్డి,పైడిపల్లి రాజు,రాయికంటి శ్రీనివాస్,వడ్ల రాజు,కవంపల్లి అజయ్,గజ్జల శ్రీకాంత్, కనకరాజు,అనిల్ కుమార్, సిపిఐ నాయకులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి,పైడిపెల్లి రాజు,బోనగిరి మహేందర్ తదితరులు పాల్గొన్నారు