కమ్యూనిస్టు పోరాట ఫలితమే తెలంగాణ విమోచన సిపిఐ
దంతాలపల్లి సెప్టెంబర్ 15 జనంసాక్షి
నిజాం పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు చేసిన పోరాట ఫలితంగానే తెలంగాణ విమోచన జరిగినట్లు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి అన్నారు. సాయిధ పోరాటం 74వ వార్షికోత్సవ సందర్భంగా సిపిఐ ప్రచార జీప్ జాతా మండల కేంద్రానికి చేరుకొని అంబేద్కర్ సెంటర్లో ఆయన మాట్లాడుతూ…తెలంగాణా రాష్ట్రంలో అధికారo కోసం బిజెపి తెలంగాణ విమోచన కోసం జరిగిన పోరాట చరిత్రను వక్రీకరిస్తూ ఆడుతున్న కపట నాటకాలలో ఉత్సవాలు జరుపుతున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోగుల శ్రీనివాస్ గౌడ్, పెరుగు కుమార్,పాండురంగాచారి, చింతకుంట్ల వెంకన్న, దర్శనం రామ్మూర్తి, సారయ్య,నవీన్,సందీప్, రమేష్, ప్రజానాట్యమండ కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area