కరాటే లో బంగారు, వెండి, పథకాలు సాధించిన ఏదుట్ల విద్యార్థులు
గోపాల్ పేట్ జనం సాక్షి ఆగస్టు(09):
గోపాల్ పేట్ మండల పరిధిలోని ఏదుట్ల గ్రామానికి చెందిన కరాటే విద్యార్థులు ఆదివారం కల్వకుర్తి లోని బాలాజీ ఫంక్షన్ హాల్లో జరిగిన ఒకటవ జాతీయస్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ పవర్ షోటో కాన్ విభాగంలో పాల్గొని చక్కటి ప్రతిభ కనబర్చారు అని మాస్టర్ సురేందర్ తెలిపారు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, మరియు యు.ఎస్ సినీ హీరో సుమన్ చేతులమీదుగా విద్యార్థులకు బంగారు వెండి పథకాలను అందించడం జరిగిందని వారు అన్నారు పథకాలు సాధించిన వారిలో రితీష్, హర్షవర్ధన్, కార్తికేయ, హర్షిత్, శ్యామ్ రాజ్ శ్రీతన్ లు ఉన్నారని అదేవిధంగా ఏదుట్ల గ్రామానికి చెందిన సంధ్యా రాణి కి బ్లాక్ బెల్ట్ ను సినీ హీరో సుమన్ చేతులమీదుగా అందుకోవడం జరిగిందని అన్నారు పథకాలు సాధించిన విద్యార్థులను కరాటే మాస్టర్ మల్లికార్జున్ గౌడ్, సురేందర్ లు అభినందించారు