కరీంనగర్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

కరీంనగర్‌: నగరంలోని పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జిల్లా కలెక్టర్‌ స్మీతాసబర్వాల్‌, రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. పోలీసులనుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీసులకు అవార్డ్‌ల ప్రధానం జరిగింది. పలువురు విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. జిల్లా ఎస్పీ, స్వాతంత్య్ర సమరయోధులు మరియు అధికారులు తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.