కరీంనగర్‌లో దీక్షకు దిగిన బిజెపి శ్రేణులు
ధరణితో బంధువులకు భూములు కట్టబెట్టారు
పోడు సమస్యలపై దీక్షలో బండి సంజయ్ ఆరోపణలు
కరీంనగర్,జూలై11((జనం సాక్షి): బీజేపీరాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మౌన దీక్ష చేపట్టారు. పోడు భూములు, గిరిజన సమస్యపై జిల్లాలోని తన కార్యాలయంలో సంజయ్ దీక్షలో కూర్చుకున్నారు. మూతికి నల్ల బ్యాడ్జీ కట్టుకుని దీక్ష చేపట్టారు. మౌన దీక్ష వేదికపై సీఎం కేసీఆర్(ఐఅఖీ) కోసం బీజేపీ నేతలు కుర్చీ వేశారు. కుర్చీ వేసుకుని గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తామని గతంలో కేసీఆర్ హావిూ ఇచ్చిన విషయం తెలిసిందే. హావిూని గుర్తు చేస్తూ బీజేపీ నేతలు కుర్చీ వేశారు. ‘ఇదిగో కుర్చీ.. సమస్యలను పరిష్కరించు కేసీఆర్ అంటూ‘ కమలం శ్రేణులు యెద్దేవా చేశారు. ఆసిఫాబాద్, ఖమ్మం, నల్గొండ, మంచిర్యాల జిల్లాలో గిరిజనులపై దాడులను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి గిరిజనులపై దాడులు చేస్తున్నరాని ఆరోపిస్తోంది. కాగా… ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన 317జీవో రద్దు కోసం జనవరిలో దీక్షకు దిగగా… అనుమతి లేదంటూ అప్పట్లో సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి భూములు, గిరిజన సమస్యపై బండి సంజయ్ దీక్షకు దిగారు.
ఈ సందర్బంగా బండి మాట్లాడుతూ తన కుటుంబ సభ్యులు, బంధువులకు మేలు చేసేందుకే సీఎం కేసీఆర్ ధరణి వ్యవస్థను తీసుకొచ్చారని ఆరోపించారు. ధరణి వల్ల అనేక మంది రైతుల భూములు గల్లంతయ్యా యని పేర్కొన్నారు. ధరణి, పోడుభూముల సమస్యలపై ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ కరీంనగర్‌లో చేపట్టిన మౌనదీక్షలో ఆయన మాట్లాడారు. ధరణి అనే దరిద్రపు పోర్టల్ తెచ్చి తెరాస ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులు పెడుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. తన కుటుంబసభ్యులు, బంధువులకు మేలు చేసేందుకే సీఎం కేసీఆర్ ధరణి వ్యవస్థను తెచ్చారని ఆరోపించారు.
వేల కోట్ల విలువైన భూములను కేసీఆర్ తన బంధువుల పేరిట మార్చుకున్నారని ఆరోపించారు. తన బండారం బయట పడుతుందనే ధరణిని కొనసాగిస్తున్నాడని దుయ్యబట్టారు. ధరణి వల్ల అనేక మంది రైతుల భూములు గల్లంతయ్యాయన్న ఆయన.. సుమారు 15 లక్షల ఎకరాలు ఇంకా ధరణిలో నమోదు కాలేదన్నారు. ధరణి లోపాల దరఖాస్తులతో రెవెన్యూ ఆఫీసులు నిండిపోయాయని పేర్కొన్నారు. భూ సమస్యలపై అడిగేందుకు వెళితే.. తమ చేతిలో ఏవిూ లేదంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారని మండిపడ్డారు. గిరిజనులపై దండయాత్ర..: మరోవైపు పోడు భూములను నమ్ముకుని బతుకుతున్న గిరిజనులపై కేసీఆర్ దండయాత్ర చేయిస్తున్నారని బండి సంజయ్ ఆక్షేపించారు. ఎన్నికలొచ్చిన ప్రతిసారి పోడు భూముల సమస్యను కుర్చీ వేసుకుని పరిష్కరిస్తానని చెప్పడం.. మాట తప్పడం అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ధరణి, పోడు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోడు భూములకు పట్టాలిచ్చేదాకా తమ పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. ధరణి అనే దరిద్రపుగొట్టు పోర్టల్ తెచ్చి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. తన కుటుంబసభ్యులు, బంధువులకు మేలు చేసేందుకే ధరణి తెచ్చారు. ధరణి వల్ల అనేక మంది రైతుల భూములు గల్లంతయ్యాయి. రెవెన్యూ ఆఫీసులు ధరణి లోపాల దరఖాస్తులతో నిండిపోయాయి. కేసీఆర్ తన బండారం బయట పడుతుందనే ధరణిని కొనసాగిస్తున్నారు. ఎన్నికలొచ్చిన ప్రతిసారి పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని చెప్పడం.. మాట తప్పడం అలవాటుగా మారింది. ధరణి, పోడు సమస్యలు వెంటనే పరిష్కరించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.గిరిజన మహిళను రాష్ట్రపతిని చేస్తున్న ఘనత భాజపాకే దక్కుతుందని మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ పేర్కొన్నారు. భాజపా అభ్యర్థి ద్రౌపది ముర్ముకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. గిరిజనులకు తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.