కరీంనగర్‌ బంద్‌కు బీజేపీ పిలుపు

కరీంనగర్‌: రోడ్డు వెడల్పులో భాగంగా అధికారుల తీరును నిరసిస్తూ నేడు కరీంనగర్‌ బీజేపీ బంద్‌కు పిలుపునిచ్చింది. పట్టణంలో 144 సెక్షన్‌ కొనసాగుతోంది పోలీసులు భారీగా మోహరించారు. వివరాల్లోకి వెళితే బస్టాండ్‌ ఆవరణలోని ఆలయానికి భజరంగ్‌ దళ్‌ సభ్యులు  నిర్మిస్తున్న ప్రహరీ నిర్మాణం వివాదాస్పదమైంది. ఈ చర్యను అడ్డుకుని వారిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పోలీసుల చర్యను నిరసిస్తూ బీజేపీ నేడు కరీంనగర్‌ పట్టణంలో బంద్‌కు పిలుపునిచ్చింది.