కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు బండి సంజయ్ ఫోన్

 

*సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచన

కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) : కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) :• భారీ వర్షాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కు ఫోన్ చేశారు.
• జిల్లాలో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అత్యధికంగా చిగురుమామిడి 51 మి.మి, కొత్తపల్లిలో 49.8 మి.మి, రేణికుంటలో 49 మి.మి, గన్నేరువరం 47.5 మి.మి వర్షపాతం నమోదైందని తెలుసుకున్నారు.
• మరో రెండ్రోజులపాటు జిల్లాలో భారీ వర్షాలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొన్న నేపథ్యంలో  అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా  ఉండాలని ఈ సందర్భంగా బండి సంజయ్ కలెక్టర్ కు సూచించారు.
• లోతట్టు ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు సహాయక చర్యలను వేగవంతం చేయాలని కోరారు.