కరీంనగర్ జిల్లా కలెక్టర్ తో బండి సంజయ్ భేటీ

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో పరిస్థితిపై ఆరాభారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో పరిస్థితిపై ఆరా🔸జిల్లా యంత్రాంగం అలర్ట్ గా ఉందని వివరించిన కలెక్టర్🔸సహాయ, పునరావాస చర్యలను వేగవంతం చేయాలని కోరిన సంజయ్🔸ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచన
కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి)
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ను కలిశారు. దాదాపు అరగంటపాటు జరిగిన ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా గత మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలవల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో పరిస్థితి, చేపడుతున్న సహాయక కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు.   జిల్లాలో ప్రమాదకర పరిస్థితి ఏమీ లేదని, అంతా అదుపులోనే ఉందని వివరించిన కలెక్టర్ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని తెలిపారు. అవసరమైన మేరకు సహాయక చర్యలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా బండి సంజయ్ కలెక్టర్ ను కోరారు.  అంతకుముందు బండి సంజయ్ కరీంనగర్ నియోజకవర్గంలోని చర్ల బూత్కుర్ గ్రామంలో పర్యటించారు. వర్షాలవల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ…. వర్షాల నేపథ్యంలో నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.  ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నందుకు ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించా