కరీంనగర్ పార్లమెంట్ లో కాషాయ జెండా శాశ్వతం చేస్తాం
కరీంనగర్ బిజెపి పార్లమెంట్ కన్వీనర్ బోయిన్ పల్లి ప్రవీణ్ రావు
కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసి, కరీంనగర్ పార్లమెంటుపై శాశ్వత కాషాయ జెండా ఎగరవేసే లక్ష్యంగా ,తగిన కార్యాచరణతో ముందుకు వెళ్తానని బిజెపి కరీంనగర్ నూతన పార్లమెంట్ కన్వీనర్ బోయిన్ పల్లి ప్రవీణ్ రావు తెలిపారు. కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ గా మాజీ బీజేవైఎం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బోయిన్ పల్లి ప్రవీణ్ రావును నియమిస్తున్నట్టు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్ రావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో పార్లమెంట్ కన్వీనర్ బాధ్యతను అప్పగించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ కి , ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. అలాగే తన నియామకానికి సహకరించిన రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ , కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగా డి కృష్ణారెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షులు రావు పద్మ, జగిత్యాల జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ రావు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. పార్లమెంట్ పరిధిలో ప్రతి గడపగడపకు బిజెపి చేరే విధంగా పటిష్ట కార్యచరణతో ముందుకు వెళ్లి, పార్టీని బలోపేతం చేయడానికి తగిన కృషి చేస్తానని ప్రవీణ్ రావు తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో శాశ్వతంగా కాషాయ జెండా ఎగురవేసే లక్ష్యంగా ఇకపై తన కార్యచరణ ఉంటుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.