కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి సహకారంతో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అపార్టుమెంట్ ఆవరణలో 11 వ వార్డు కౌన్సిలర్ జక్కు పద్మ-రవీందర్ ఆధ్వర్యంలో కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి సహకారంతో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని టీపీసీసీ సభ్యులు సంగనభట్ల దినేష్ ప్రారంభించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన ఈ శిబిరానికి మంచి స్పందన లభించింది. ఆసుపత్రి వైద్యులు డాక్టర్ చీటీ కార్తీక్, డాక్టర్ రమేష్, ల్యాబ్ టె క్నీషియన్లు, సిబ్బంది సుమారు 200 మంది పేషంటలకు సాధారణ, షుగర్, బీపీ, ఈసీజీ పరీక్షలు జరిపి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం వైద్యులు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి పేషంట్లకు వివరించారు. ఈ శిబిరాన్ని ఐఎంఎ జగిత్యాల జిల్లా అధ్యక్షులు, ప్రముఖ వైద్యులు ( జనరల్ సర్జన్ ) డాక్టర్ తాటిపాముల సురేష్ కుమార్ సందర్శించారు. కొంత సేపు పేషంట్లకు వైద్య పరీక్షలు చేసి నిర్వాహకులు, కౌన్సిలర్ జక్కు పద్మ-రవీందర్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జక్కు పద్మ-రవీందర్, క్యాంపు కో ఆర్డినేటర్ కిరణ్ కుమార్, పీఆర్వో భువనగిరి మహేష్, ఆలయ రినో్వేషన్ కమిటీ సభ్యురాలు గందె పద్మ, ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ మామిడాల రవీందర్, డాక్టర్ సర్జరావు, అశోక్, పప్పుల శ్రీనివాస్, రంగ హరినాథ్, జైశెట్టి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.