కరీంనగర్ లో బిజెపి ఆందోళన
* కాంగ్రెస్ ది కుసంస్కారం
* సోనియాగాంధీ దిష్టిబొమ్మ దహనం
* కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని గంగాడి డిమాండ్
కరీంనగర్ ( జనం సాక్షి ) :
భారత రాష్ట్రపతి, ఆదివాసి మహిళ ద్రౌపది ముర్ము ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుల వైఖరిని ఖండిస్తూ గురువారం బిజెపి కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ లో సోనియాగాంధీ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేత రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కించపరిచే విధంగా మాట్లాడినందుకు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఆదివాసి మహిళా అయిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అభ్యర్థి కావడం కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోయిందని, ఆదివాసి మహిళ అయినా ద్రౌపది ముర్మకు దేశవ్యాప్తంగా అనేక పార్టీలు మద్దతునిచ్చి ఆమె విజయానికి సహకరించాయని, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆదివాసి మహిళకు మద్దతివ్వకుండా రాజకీయాలు చేసిందని ఆయన దుయ్యబట్టారు. నేడు రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము స్వీకారం చేసిన వెంటనే పార్లమెంటులో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత చే రాష్ట్రపతి పై అర్థరహిత వ్యాఖ్యలు చేయించిందని, ఆ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ కుసంస్కరానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. పార్లమెంట్ సభ్యుడి హోదాలోఉన్న కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రాష్ట్రపతి గురించి సోయండి మాట్లాడారా లేక వ్యంగంతో అగౌరపరచాలనే మాట్లాడారా అన్నది వారి సంస్కార హీనతకు నిదర్శనం అన్నారు. రాష్ట్రపతి పేరును అగౌరవపరిచే విధంగా, అసభ్యకరంగా సంబోధించడం ఎంతవరకు సమంజసమనీ ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మహిళగా సాటి గిరిజన మహిళ రాష్ట్రపతి అయితే ఆ పార్టీ తరపున ఇచ్చే గౌరవం ఇదేనా అన్నారు. ఆదివాసి మహిళ పై కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు తో ఆ పార్టీకి గిరిజనులపై ఉన్న ప్రేమ, చిత్తశుద్ధి ఏలాంటిదో అర్థమవుతుందన్నారు . రాష్ట్రపతి ద్రౌపది పై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని, రాష్ట్రపతికి , దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొరటాల శివరామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్లెం వాసుదేవరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు మాడ వెంకట్రెడ్డి, జిల్లా కార్యదర్శి రాపర్తి ప్రసాద్, జిల్లా ఆఫీస్ సెక్రెటరీ మాడుగుల ప్రవీణ్, జిల్లా మీడియా కన్వీనర్ కటకం లోకేష్, జిల్లా అధికార ప్రతినిధులు బొంతల కళ్యాణ్ చంద్ర, జానపట్ల స్వామి,జెల్ల సుధాకర్, చొప్పరి జయ శ్రీ, బండ రమణారెడ్డి, యెన్నం ప్రకాష్, బండారి గాయత్రి, దుబాల శ్రీనివాస్, ఎండి జమాల్, బల్బీర్ సింగ్, కార్పొరేటర్లు అనుప్, పెద్దపల్లి జితేందర్, నాగసముద్రం ప్రవీణ్, ఆవుదుర్తి శ్రీనివాస్, మంథని కిరణ్, వరాల జ్యోతి, లక్ష్మణరావు, దళిత మోర్చా అధ్యక్షులు సోమిడి వేణు, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఎండి పర్వేజ్, కూరపాటి మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.