కరీమాబాద్ బొమ్మల గుడిలో పూజలు
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 08(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని కరీమాబాద్ శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయం బొమ్మల గుడి లో పవిత్ర శ్రావణ మాసం సోమవారం ఏకాదశి సందర్భంగా భక్తులు స్వామివారికి పూజలు నిర్వహించారు .ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శివపురం రామలింగ ఆరాధ్య ఉదయం నుంచి స్వామివారికి అభిషేకాలు చేశారు .భక్తులు స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు .ఈ కార్యక్రమంలో మాడిశెట్టి మురళి, నాగపురి అశోక్, ఎలాగొండ రవి, సుంకరి సంజీవ్, తరాల రాజమణి, నాగమణి ,కళావతి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు