కరుణించి కాపాడు కోట మైసమ్మ తల్లి.

 

.జాతరలు,ఉత్సవాలు ప్రజల సంప్రదాయాల ను ప్రతిబింబిస్తాయి.

బోనమెత్తిన వైస్ చైర్ పర్సన్.
మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపనర్సింలు.
తాండూరు జులై 17(జనంసాక్షి) పట్టణ ప్రజలను కరుణించి కాపాడు కోట మైసమ్మ తల్లి అని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు అమ్మవారిని వేడుకున్నారు. ఆదివారం తాండూర్ పట్టణంలోని పాత తాండూరులో అక్కన్న మాదన్న కోటలో శ్రీ కోటమైసమ్మ దేవాలయ బోనాల జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ బోనాల జాతర మహోత్సవ వేడుకలో తాండూరు మున్సిపల్ వైస్
చైర్ పర్సన్ పట్లోళ్ల దీపనర్సింలు పాల్గొని అమ్మవారిని దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అదేవిదంగా పట్టణంలోని మణిక్ నగర్ కాలనీ లోని మైసమ్మ దేవాలయంలో జరిగిన బోనాల జాతరలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైస్ చైర్ పర్సన్ మాట్లాడుతూ పాతతాండూరు కోటమైసమ్మ బోనాల జాతర ఉత్సవాలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.జాతరలు,ఉత్సవాలు ప్రజల సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని,ప్రతి ఒక్కరూ దైవచింతన అలవర్చుకోవాలని మైసమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ తాండూర్ ప్రజలందరిపై ఉండాలని ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరినట్లు ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సంగీతా ఠాకూర్, స్టేషన్ హనుమాన్ దేవాలయ చైర్మన్ సంజీవ్ రావు,కో-ఆప్షన్ సభ్యురాలు సరంగా విజయ్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లప్ప,నాయకులు డా.సంపత్ కుమార్,చంటి యాదవ్,నిరటి హాన్మంతు,డేవిడ్ సన్నీ,కాలనీ వాసులు,భక్తులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.