కరెంటు కోతలతో రైతులకు తప్పని ఇబ్బందులు

మల్కిజ్ గూడ మాజీ సర్పంచ్ మల్లేష్

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జూన్23(జనంసాక్షి):- కరెంటు కోతలతో రైతులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పంటకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదని మల్కిజ్ గూడ మాజీ సర్పంచ్ మల్లేష్ అన్నారు. యాచారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ..  తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ఎవరు చేయలేని విధంగా తాము ఉచిత కరెంటు 24 గంటలు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వం గత నెల రోజులుగా 7 గంటలు మాత్రమే కరెంటు సరఫరా చేస్తున్నారని అందులో కూడా కోతలు విధిస్తూ ఉండడంతో, పుష్కలంగా బోరుబావుల లో నీళ్లు ఉన్న కరెంటు కోతలతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారని మండిపడ్డారు కరెంటు కోతలతో పంటపొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కరెంటు కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించాలని లేనిపక్షంలో రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని అన్నారు.