కరోనాకు కుం లేదు.. మతం లేదు `

మానవ జీవితాన్ని కరోనా మార్చేసింది
` ప్రస్తుత పరిస్థితుల్లో ఇు్ల కొత్త ఆఫీస్‌గా, ఇంటర్నెట్‌ సమావేశ గదిగా మారాయి
` ఈ మార్పును నేను అవాటు చేసుకుంటున్నాను ` ట్విటర్‌ వేదికగా ప్రధాని స్పందించిన
ప్రధాని మోదీ దిల్లీ: మహమ్మారి కరోనా వైరస్‌కు జాతి, కుం, మతం, రంగు లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో వైరస్‌ ప్రభావం అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆదివారం ట్విటర్‌ వేదికగా ప్రధాని స్పందించారు. ‘కోవిడ్‌ వ్యాధి కుం, మతం, రంగు, జాతి, భాష.. ఇవేవిూ చూడదు. భాష, సహిహద్దు ఇలా వేటినీ కరోనా పట్టించుకోదు, ఐక్యత, సోదర భావానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రస్తుతం ప్రపంచం కొత్త వ్యాపార నమూనా కోసం వెతుకుతోంది. సందర్భానికి తగ్గట్టుగా స్పందించి అవకాశాను అందిపుచ్చుకోవాలి’ అని మోదీ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.ప్రస్తుత పరిస్థితుల్లో ఇు్ల కొత్త ఆఫీస్‌గా, ఇంటర్నెట్‌ సమావేశ గదిగా మారాయని, వృత్తి జీవితాన్ని కరోనా వైరస్‌ పూర్తిగా మార్చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఇక విూదట ఆఫీస్‌ సహచరుతో విరామ సమయం అనేది చరిత్రగా ఉండిపోనుందని అన్నారు. ‘‘ప్రస్తుతం చోటు చేసుకున్న మార్పును నేను అవాటు చేసుకుంటున్నాను. చాలా వరకు మంత్రివర్గ సహచయి, అధికాయి, ప్రపంచ నాయకుతో నా సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్‌లోనే జరుతున్నాయి’’ అని లింక్డ్‌ఇన్‌ అనే సామాజిక మాధ్యమంలో ప్రధాని పేర్కొన్నారు. అంతే కాకుండా సుభంగా అనుసరించగలిగే వ్యాపార, జీవనశైలి గురించి మనం ఆలోచనచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ‘‘ప్రాణ నష్టం జరగకుండా, సంక్షోభ సమయంలో కూడా మనం పని చేయగలిగితే మన ఆఫీస్‌, వ్యాపారం, ఆర్థిక కార్యకలాపాు ఎంతో వేగంగా ముందుకు సాగుతాయి’’. ఈ రోజుల్లో ప్రపంచం కొత్త వ్యాపార మార్గా కోసం వెతుకుతోంది. ఎక్కువ మంది యువత కలిగి, వినూత్న ఆలోచనకు పేరుగాంచిన భారత్‌ వాటిని ప్రపంచానికి అందివ్వడంలో ముందడుగు వేయగదని అన్నారు. అంతర్జాతీయంగా కరోనా వైరస్‌ ప్రభావం తగ్గిన తర్వాత భౌతిక, వాస్తవిక సమ్మేళనంతో భారత్‌, అంతర్జాతీయ బహుళ ఉత్పత్తు సరఫరాకు కేంద్రంగా మారగదని ఆశాభావం వ్యక్తం చేశారు. సాంకేతికత అధికారు ఆధిపత్యాన్ని తగ్గించి, దళారి వ్యవస్థను రూపుమాపి, సంక్షేమ ఫలా అమును వేగవంతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.