కరోనా ఎఫెక్ట్‌..సీఆర్‌పీఎఫ్‌ కేంద్ర కార్యాయం మూసివేత

ఢల్లీి,మే 3(జనంసాక్షి):ఢల్లీిలోని సీఆర్‌పీఎఫ్‌ హెడ్‌క్వార్టర్స్‌ను సీజ్‌ చేశారు. కార్యాయంలో పనిచేసే ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో.. ఆఫీసును మూసివేశారు. సీనియర్‌ ఆఫీసర్‌కు చెందిన పర్సనల్‌ స్టాఫ్‌కు వైరస్‌ సంక్రమించినట్లు తొస్తున్నది. స్పెషల్‌ డైరక్టర్‌ జనరల్‌ ర్యాంక్‌ ఆఫీసర్‌ జావెద్‌ అక్తర్‌ దగ్గర పనిచేసే పర్సనల్‌ సెక్రటరీకి వైరస్‌ వచ్చినట్లు అనుమానాు ఉన్నాయి. దీంతో బిల్డింగ్‌ను మూసివేశారు. పాజిటివ్‌ కేసు గురించి జిల్లా నిఘా అధికారుకు తెలియజేశారు. లోధీ రోడ్డులో ఉన్న సీజీవో కాంప్లెక్స్‌ను మూసివేశారు. జావెద్‌ అక్తర్‌తో పాటు మరో పది మంది సిబ్బందిని క్వారెంటైన్‌కు పంపారు. వారితో టచ్‌లో వచ్చినవారిని గుర్తించే పనిలో పడ్డారు. శానిటైజేషన్‌ పూర్తి అయ్యేంత వరకు బిల్డింగ్‌ను మూసి ఉంచనున్నారు.  బిల్డింగ్‌ సురక్షితమని అధికాయి ద్రువీకరించిన తర్వాతనే ఉద్యోగుకు అనుమతి ఇవ్వనున్నారు. సీఆర్‌పీఎఫ్‌కు చెందిన ఓ డ్రైవర్‌కు కూడా కరోనా పాజిటివ్‌ తేలింది. ఇప్పటి వరకు 144 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు కరోనా సోకింది. దాంట్లో 135 మంది ఢల్లీిలోని మయూర్‌ విహార్‌ ఫేజ్‌ 3లో ఉండే బెటాలియన్‌ 31కు చెందినవారు. కేసు బయటపడిన తర్వాత ఆ బెటాయలిన్‌ మొత్తాన్ని మూసివేశారు. సీఆర్‌పీఎఫ్‌ డీజీ ఏపీ మహేశ్వరి 21 రోజు పాటు క్వారెంటైన్‌లో ఉన్నారు.