కరోనా పరీక్షలు పేదలకే ఉచితం ఆదేశించిన సుప్రీంకోర్టు

దిల్లీ, ఏప్రిల్ 13(జనంసాక్షి): కరోనా వైరస్ పరీక్షలు కేవలం పేదలకు మాత్రమే ఉచితంగా చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వారితో పాటు ఎవరెవరికీ పరీక్షలు ఉచి తంగా నిర్వహించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వమే తీసుకోవాలని సూచిం చింది. గత వారం మహమ్మారి నిర్ధారణ పరీక్షలు అందరికీ చేయాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అయితే ప్రైవేట్ లాబొరేటరీస్ ఉచి తంగా చేయలేమని పేర్కొనడంతో తాజాగా ఈ నిర్ణయాన్ని తీసుకుం . “ఆయుష్మాన్ భారత్ పథకానికి అర్హులైన వారికి, ప్రభుత్వం గుర్తిం చిన ఆర్థిక బలహీన వర్గాలకు ఉచితంగా

ర్టు ఉత్తర్వులో తెలిపింది. వారితో కరోనా పరీక్షలు పేదలకే ఉచితం పరీక్షలు నిర్వహించాలి” అని సుప్రీంకోర్టు ఉత్తర్వులో తెలిపింది. వారితో పాటు అనధికారిక రంగాలలో తక్కువ ఆదాయం సంపాదించే కార్మికులకు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు పొందే లబ్దిదారులకు లేదా ఇతర వర్గాలకు కూడా ఉచితంగా నిర్వహించడంపై కేంద్రం, వైద్యారోగ్య శాఖ నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. తీసుకున్న నిర్ణయాన్ని వారం రోజుల్లోగా తెలియజేయాలని ఆదేశించింది.