కర్నాటక కాంగ్రెస్‌లో నిరాశ

అధికారం గల్లంతు కావడంతో నేతల్లో కానరాని ఉత్సాహం
బెంగళూరు,మే15(జ‌నం సాక్షి): కర్నాకట కాంగ్రెస్‌లో నైరాశ్యం ఆవరించింది. పార్టీ ఓడిపోవడంతో సిద్దరామయ్యపై కార్యకర్తలు పెట్టుకున్న ఆశలు వమ్మయ్యాయి. రెండోమారు మళ్లీ అధికారంలోకి వస్తమాన్న ఆశలు గట్టిగా ఉన్నా తలకిందులయ్యయి. కర్నాటకలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం, అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఓడిపోవడం సహజంగానే బిజెపిలో కొత్త ఉత్తేజం, కాంగ్రెస్‌లో నిరాశ ఏర్పడింది. కాంగ్రెస్‌కు కేవలం డెబ్బై సీట్ల లోపు మాత్రమే విజయం సాదించడం, భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజార్టీ 113 సీట్లు రావడం అందరిని ఆశ్చర్య పరచింది.ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ ఈ ఫలితాలు వచ్చాయి.ఎక్కువ ఎక్జిట్‌ పోల్స్‌ హంగ్‌ అసెంబ్లీని అంచనా వేస్తే , బిజెపి ఏకంగా అధికారంలోకి వచ్చేసింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్యే ఒక నియోజకవర్గంలో వెనుకంజ వేయడం ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది.జెడిఎస్‌ అంచనాలను మించి 46 సీట్లు గెలుచుకుంది.సాధారణ ఎన్నికల ముందు ఈ ఫలితాలు బిజెపికి ఊపు తెచ్చేవి కాగా, కాంగ్రెస్‌ను బాగా కుంగదీసాయి. బిజెపిక చెక్‌
పెట్టాలన్న ఆశలు వమ్మయ్యాయి. కర్నాటక తరవాత ఆంధ్రప్రదేశ్‌ గురించి బిజెపి అద్యక్షుడు అమిత్‌ షా కలలు కంటున్న తరుణంలో ఈ ఎన్నికలు టిడిపికి కూడా కొంత చేదుమాత్రగానే భావించాలి. త్రిపురలో గెలిచిన మాదిరి ఎపిలో గెలుస్తామని షా ప్రతిపాదించారు. ఏపీలో పార్టీ బలహీనంగా ఉందనే ప్రచారం జరుగుతోందని.. త్రిపురలో కూడా ఇదే ప్రచారం ఉండేదని, దానిని అధిగమించి ఎలా అధికారంలోకి వచ్చామో అలాగే ఏపీలో కూడా వస్తామనే విశ్వాసం ఉందని షా అన్నారని సమాచారం. అయితే కర్నాటకలో విజయం బిజెపి శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.