కలీస్ ఆల్
రౌండ్ షో
– రెండు వికెట్లు, 41 పరుగులు.. – ఐదు వికెట్ల తేడాతో గెలిచిన కోల్‌కతా
రాంచీ :రాంచీలో ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగూళూర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. 115 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ 19.2 ఓవర్లలో 5 వికెట్ల కోల్పోయి ఛేదించింది. రాయల్‌ఛాలెంజర్స్ బెంగుళూర్‌ను, కోల్‌కతా బౌలర్స్ సేనానాయకే, బాలాజీ, నరైన్, కల్లిస్ తమ బౌలింగ్‌తో కట్టడి చేశారు. కోల్‌కతా బౌలింగ్ ధాటికి బెంగుళూర్ 115 పరుగులకే కుప్పకూలింది నరైన్ 4 ఓవర్లలో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు, సేనానాయకే 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు, బాలాజీ 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. కల్లిస్ 4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో బెంగుళూర్‌లో గేల్ 33, కోహ్లీ 17, డివిలియర్స్28, కుమార్ 14 పరుగులు చేశారు. కోల్‌కతా కల్లిస్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసి, బ్యాటింగ్‌లో 41 పరుగులు చేసి కోల్‌కతా విజయంలో కీలక పాత్ర పోషించాడు. కోల్‌కతాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది, మొదటి ఓవర్లో రెండవ బంతికి బిస్లాను రాంపాల్ అవుట్ చేశాడు. తర్వాత కల్లిస్, తివారీ నిలకడగా ఆడి కోల్‌కతా విజయంలో కీలక పాత్ర పోషించారు. వరుస విజయాలతో ఫామ్‌లో ఉన్న బెంగుళూర్‌కు బ్రేక్ పడింది. కోల్‌కతా బ్యాటింగ్‌లో కల్లిస్ 41, గంభీర్ 14, తివారి 24, పఠాన్ 18, డియోస్చేట్ 11 పరుగులు చేశారు. కోల్‌కతా విజయంలో కీలక పాత్ర పోషించిన కల్లిస్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.