కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీల ధర్నా

విజయనగరం, జూలై 16 : జిల్లాలో పని చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్ఫర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వార్యాన వందలాది మంది అంగన్‌వాడీ కార్యకర్తలు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. వారి ప్రధాన డిమాండ్లను వీరు ప్రభుత్వానికి తెలియజేస్తూ గత ఏడు నెలలుగా జీతాలు చెల్లించలేదని, నాలుగు నెలలుగా పిఎ డిఎలు, అంగన్‌వాడీ భవనాల అద్దెలు చెల్లించలేదని విమర్శించారు. బడ్జెట్‌ కంట్రోల్‌ నుంచి అంగన్‌వాడీ వర్కర్ల జీతాలను తొలగించాలని వీరు కోరారు. సిఐటియు నాయకులు సూర్యనారాయణ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల జిల్లా కమిటీకి చెందిన సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు వినతిపత్రం సమర్పించారు.