కలెక్టరేట్ ముందు గ్రామపంచాయతీ వర్కర్ల ధర్నా
వనపర్తి సెప్టెంబర్ 30(జనం సాక్షి) తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి అనంతరం ఏవో కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కార్మిక వర్గానికి 30 శాతం పిఆర్సి అమలు చేస్తానని మర్చిపోయిందని కనీస వేతనం 26,000 ఇవ్వాలని,గ్రామపంచాయతీ వర్కర్స్ కి ప్రమాద బీమా 10 లక్షలు,సహజ మరణానికి ఐదు లక్షలు భీమా సౌకర్యాన్ని, అమలు చేయాలని పని ప్రతిపాదికను వర్కర్స్ ను నియమించాలని వర్కర్స్ కు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని వైద్య సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్లతో కలెక్టరేట్లో ఏవో కి వినతిపత్రం సమర్పించారు.ఈ డిమాండ్లను ప్రభుత్వాలు నెరవేర్చకపోతే భవిష్యత్తులో బలమైన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు ప్రసాద్ నాయకులు కుర్మయ్య, సుబ్బయ్య,గట్టయ్య,కరీం,రామ చంద్రి, గోవిందమ్మ, వెంకటయ్య,నాగమ్మ,పద్మ,గంగమ్మ, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.