కలెక్టర్ చేతుల మీదుగా ప్రతిభ అవార్డు అందుకున్న అక్షయ

లింగంపేట్ 07 ఆగస్టు (జనంసాక్షి)
 లింగంపేట్ మండలంలోని శెట్పల్లి గ్రామానికి చెందిన గోనే అక్షయకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ జిత్ ష్ వి పాటిల్ ప్రతిభ అవార్డు అందజేసారు.వ్యాసరచన పోటీలో జిల్లా స్థాయిలో ప్రథమస్థానంలో నిలిచిన గోనే అక్షయకు ఆయన అవార్డు అందజేసి అభినందించారు.ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలొని రోటరీ క్లబ్ ఆద్వర్యంలొ చేనేత కార్మికుల దినోత్సవం పురస్కరించు కొని నిర్వహించిన కార్యక్రమంలో అక్షయ కలేక్టర్ చేతుల మీదుగ ప్రతిభ అవార్డు అందుకుంది.ఈ నెల 4 న జిల్లా స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో జిల్లాలోని అన్ని మండలాల నుండి 22 మంది విద్యార్థులు పాల్గొన్నారు.వ్యాసరచనలో మంచి ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలో ప్రథమస్థానంలో నిలిచిన గోనే అక్షయకు కలెక్టర్ అభినందించి ప్రతిభ అవార్డు అందజేసారు.ప్రధానోపాద్యాయుడు సాయన్నను కలెక్టర్ జిత్ ష్ వి పాటిల్  అభినందించారు.వ్వాసరచనలో గోనే అక్షయ జిల్లా స్థాయిలో ప్రథమస్థానం తీసుక రావడంతొ పాఠశాల ఉపాద్యాయ బృందం పలువురు నేతలు లింగంపేట్ శెట్పల్లి గ్రామస్తులు అక్షయను అభినందించారు.