కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న మంతటి గోపి.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు17(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని 75 వ స్వతంత్ర వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు.తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు మీసాల రాము మాదిగ ఆదేశాల మేరకు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జి మంతటి గోపి మాదిగ రక్తదానం చేయడం జరిగిందని మంతటి గోపి తెలిపారు.ఈ సందర్భంగా మంతటి గోపి మాట్లాడుతూ రక్త దానం చేయడం వల్ల, మరొకరి  ప్రాణం కాపాడిన వారము అవుతామని వారు అన్నారు.ప్రతి ఒక్కరు రక్తదానం చేయండి ప్రాణదాతలుగా నిలబడండి అని ప్రజలను కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్, జిల్లా జడ్పీ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి, రెడ్ క్రాస్ సొసైటీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు రమేష్ రెడ్డి, డాక్టర్ రోహిత్ కుమార్, చేతుల మీదుగా మంత్రి గోపి ప్రశంస పత్రం అందుకున్నారు.ఈ కార్యక్రమంలో  మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, తదితరులు పాల్గొన్నారు.