కేసీఆర్‌.. అసెంబ్లీకి రా.. కృష్ణాజలాలపై చర్చిద్దాం..

` నువ్వు అసెంబ్లీకి వచ్చింది రెండ్రోజులు..
` తీసుకున్న జీతం రూ.57లక్షలు
` మాజీ సీఎంపై మండిపడ్డ సీఎం రేవంత్‌రెడ్డి
` ప్రధాని మోదీని కలవడంలో రాజకీయం ఏముంది?
` కమీషన్లు తీసుకొని హైదరాబాద్‌ నగరాన్ని సర్వనాశనం చేశారు
` చెరువులు, కుంటలు మాయం చేశారు
` తెలంగాణను అప్పులకుప్ప చేసింది కాకుండా తిరిగి మాపైనే విమర్శలా..
` గవర్నర్‌ ప్రసంగం లేకుండానే 2022 బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభించారు
` కేసీఆర్‌ వందేళ్లు ఆయురారోగ్యాలతో ప్రతిపక్షంలోనే ఉండాలి..
` అసెంబ్లీ, మండలిలో సీఎం రేవంత్‌ రెడ్డి
హైదరాబాద్‌,మార్చి15(జనంసాక్షి):మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చినప్పుడే కృష్ణా జలాలపై చర్చ పెడదామని అన్నారు. తాము తప్పు మాట్లాడినట్లు తేలితే క్షమాపణలు చెప్పేందుకు కూడా సిద్ధమని స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా కేసీఆర్‌కు రూ.54.84 లక్షల జీతం ఇచ్చారని.. కానీ ఇప్పటి వరకు కేసీఆర్‌ రెండు సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారని తెలిపారు. రోజా ఇంట్లో కేసీఆర్‌ రొయ్యల పులుసు తిని.. రాయలసీమను రతనాల సీమ చేస్తామన్నారని గుర్తుచేశారు. ఒక్కసారి రొయ్యల పులుసు పెడితేనే రాయలసీమను రతనాల సీమ చేస్తా అని అన్నారని.. కానీ గుండెల్లో పెట్టుకుని మహబూబ్‌నగర్‌ ప్రజలు రాజకీయ భిక్షపెడితే గుండెల మీద తంతారా అని, ఎంపీగా గెలిపించిన పాలమూరు ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్‌ హయాంలోనే సాగర్‌కు సీఆర్‌పీఎఫ్‌ బలగాలు వచ్చాయని చెప్పుకొచ్చారు. అప్పుడు సైలెంట్‌గా ఉన్న బీఆర్‌ఎస్‌.. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తప్పుబడుతోందంటూ రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా నీటి విషయంలో రాష్ట్రానికి మరణశాసనం రాశారన్నారు. కేసీఆర్‌ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని పెంచారని గుర్తుచేశారు. కమీషన్ల కోసమే జూరాల నుంచి తీసుకోవాల్సిన నీళ్లను శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ ద్వారా తీసుకుంటామన్నది నిజం కాదా అని నిలదీశారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ఉమ్మడి రాష్ట్రంలోనే 20 కి.మీ మేర పూర్తి చేశారని తెలిపారు. కేసీఆర్‌ పాలనలో ప్రాజెక్ట్‌ పనులే చేపట్టలేదన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై సానుభూతి చూపించాల్సిన బీఆర్‌ఎస్‌ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారంటూ మండిపడ్డారు. ‘మీ స్ట్రేచర్‌ గురించి ఉన్న ఆలోచన స్టేట్‌ ఫ్యూచర్‌ మీద లేదా. బీఆర్‌ఎస్‌ ఇప్పుడు మార్చురీలో ఉందని అన్నా.. తప్పేముంది. నేను కేసీఆర్‌ను కించపరిచినట్టు కేటీఆర్‌, హరీష్‌ రావు విమర్శిస్తున్నారు. కేసీఆర్‌ వందేళ్లు జీవించి ప్రతిపక్షంలోనే ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ సీఎం వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే వ్యవస్థలు ఏర్పడ్డాయని సీఎం అన్నారు. 2022 బడ్జెట్‌ సమావేశాలు గవర్నర్‌ ప్రసంగం లేకుండానే ప్రారంభించారని గుర్తుచేశారు. గత ప్రభుత్వానికి ప్రజాస్వామ్య విలువలు పాటించలేదని విమర్శించారు. మహిళా గవర్నర్‌ను గత ప్రభుత్వం అవమానించిందన్నారు. గవర్నర్‌ ప్రసంగం గాంధీభవన్‌లో కార్యకర్త ప్రసంగంలా ఉందని కొందరు తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారని మండిపడ్డారు. గవర్నర్‌ ప్రసంగం కాంగ్రెస్‌ విధానాలకు వ్యతిరేకంగా ఉండదని.. తమ కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ప్రజాపాలన అని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు వ్యక్తుల ఆస్తి కాదన్నారు. బలహీనవర్గాలకు చెందిన మహిళా గవర్నర్‌ను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవహేళన చేసిందంటూ వ్యాఖ్యలు చేశారు సీఎం. అయితే సీఎం మాట్లాడుతున్న సమయంలోనే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. కేసీఆర్‌పై సీఎం వ్యాఖ్యలకు నిరసనగా వాకౌట్‌ చేశారు. కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం ప్రసంగాన్ని వినబోమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. బీఆర్‌ఎస్‌ నేతలు ఇలాగే వ్యవహరిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సున్నానే మిగులుతుందంటూ ఎద్దేవా చేశారు. కేబినెట్‌ ఆమోదం పొందిన అంశాలే గవర్నర్‌ ప్రసంగంలో ఉంటాయని తెలిపారు. కనీస అవగాహన లేకుండా విపక్ష నేతలు మాట్లాడుతున్నారన్నారు. ప్రజల కోసం విపక్షాలు సూచనలు చేస్తే స్వీకరిస్తామన్నారు. గత ప్రభుత్వం కేబినెట్‌ ఆమోదం లేకుండానే గవర్నర్‌ ప్రసంగం ఉందా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌కు గవర్నర్‌ వ్యవస్థపై నమ్మకం లేదన్నారు. అప్పులతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. మొదటి ఏడాదిలోనే రూ.20 వేల కోట్లకుపైగా రుణమాఫీ చేశామన్నారు. మార్చి 31 నాటికి రైతులందరికీ రైతు భరోసా ఇస్తామని స్పష్టం చేశారు. భూమి లేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నామన్నారు. రైతుల నుంచి ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తామని వెల్లడిరచారు. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇచ్చామన్నారు. గతంలో ఎక్కడ పంట పండినా కాళేశ్వరం వల్లే అన్నారని.. కానీ కాళేశ్వరం నీళ్లు లేకున్నా రికార్డ్‌ స్థాయిలో ధాన్యం పండిరదని తెలిపారు. గత ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై రైతులకు అన్యాయం చేసిందన్నారు. వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే అని కేసీఆర్‌ అనలేదా అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.
కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చింది రెండ్రోజులు.. తీసుకున్న జీతం రూ.57లక్షలు: సీఎం రేవంత్‌రెడ్డి
భారాస అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదని అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శాసన సభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగులేనని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.‘’కేసీఆర్‌ శాసనసభకు వచ్చింది రెండు సార్లు మాత్రమే. శాసనసభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తీసుకున్న జీత భత్యాలు రూ.57,84,124. డిసెంబరు 2023 నుంచి 28 ఫిబ్రవరి 2025 వరకు.. దాదాపు 15 నెలలుగా జీత భత్యాల రూపంలో ఆయన తీసుకున్న ప్రభుత్వ సొమ్ము ఇది. శాసనసభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగులేనని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. ఆయన మాత్రం రెండు సార్లే అసెంబ్లీకి వచ్చారు. నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎక్కడా పర్యటనలకు కూడా వెళ్లలేదు. ప్రజా సమస్యలపై చట్ట సభల్లో ప్రస్తావించిన సందర్భాలు లేవు. కొవిడ్‌ సమయంలో వర్క్‌ ఫ్రమ్‌ హోం ఫెసిలిటీ ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. రాజకీయాల్లో వర్క్‌ ఫ్రమ్‌ హోం.. వర్క్‌ ఫ్రమ్‌ ఫామ్‌ హౌస్‌ వంటిది ఏమైనా ఉందా? వారి బాధ్యతలు నెరవేర్చడం లేదు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
ప్రధాని మోదీని కలవడంలో రాజకీయం ఏముంది?
దిల్లీ పర్యటన పేరుతో ఎలాంటి దుబారా చేయడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రాల సీఎంలకు పెద్దన్న లాంటివారని..ఆయన్ను తాను కలవడంలో రాజకీయం ఏముందని ప్రశ్నించారు. ప్రధాని, కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు రాష్ట్రాల అభివృద్ధికి దోహదపడతాయని.. అందువల్ల కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించాలన్నారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధాని మోదీని కలిశానని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ‘’ప్రధానిని గౌరవించే విజ్ఞత మాది. రాజకీయాలకు వచ్చినప్పుడు నేను కాంగ్రెస్‌ నేతను.. ఆయన భాజపా నాయకుడు. అవరసమైతే మహేశ్వర్‌రెడ్డిని దిల్లీ తీసుకెళ్తాం. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని నాలుగు సార్లు కలిశాం. నిర్మలాసీతారామన్‌, అమిత్‌ షాలను కూడా కలిశాం’’ అని సీఎం వివరించారు.కమీషన్లు తీసుకొని హైదరాబాద్‌ నగరాన్ని సర్వనాశనం చేశారని సీఎం విమర్శించారు. చెరువులు, కుంటలు మాయం చేశారన్నారు. అపార్ట్‌మెంట్‌లకు తగినట్లు డ్రైనేజీ వ్యవస్థ లేకుండా పోయిందన్నారు. చెరువులు, కుంటలను పునరుద్ధరించాలని ప్రయత్నిస్తుంటే అనవసరంగా గగ్గోలు పెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. లెక్క లేకుండా అనుమతులిచ్చి నగరంలో గందరగోళం సృష్టించారని గత భారాస ప్రభుత్వ పనితీరుపై మండిపడ్డారు. ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేశాం. ప్రపంచ దేశాలతో పోటీపడేలా నగరాన్ని నిర్మించాలని చూస్తే అడ్డం పడుతున్నారు. పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామంటే అడ్డుపడుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ సలహాలు, సూచనలిస్తే పాటించేందుకు సిద్ధంగా ఉన్నాం. అనుభవం ఉన్న వ్యక్తిగా ఆయన చెప్పినవి పాటిస్తాం.అప్పులు పెండిరగ్‌లో పెట్టి పారిపోతే మేము కట్టుకుంటున్నాం. కేసీఆర్‌ పాలనలో తప్పులు.. అప్పులే చేశారు. ఈ 15 నెలల కాలమంతా కేసీఆర్‌ చేసిన అప్పులు, తప్పులు సరిచేయడానికే సరిపోయింది. వాళ్లు పెట్టిన అప్పులకు వడ్డీలు కట్టడమే భారంగా ఉంది. అప్పులు పెట్టింది కాకుండా తిరిగి మాపైనే విమర్శలు చేస్తున్నారు. డిస్కంలు, సింగరేణి, కాంట్రాక్టర్లకు బిల్లులు పెండిరగ్‌ పెట్టి వెళ్లిపోయారు. రూ.8 లక్షల కోట్ల అప్పులు మాపై వేశారు. రూ.1.52 లక్షల కోట్లు అప్పు చేశామని మాపై బురద జల్లుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ అప్పు రూ.7,38,707 కోట్లు. అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాన్ని నడపాలని అనుకోవడం లేదు. ప్రజలే మా బాసులు.. నన్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన ప్రజలకు నేను జవాబుదారిగా ఉండాల్సిన బాధ్యత నాపై ఉంది’’ అని సీఎం వివరించారు.
గవర్నర్‌ ప్రసంగం లేకుండానే 2022 బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభించారు
కేసీఆర్‌ వందేళ్లు ఆయురారోగ్యాలతో ప్రతిపక్షంలోనే ఉండాలి..
హైదరాబాద్‌: రాజ్యాంగ స్ఫూర్తితోనే వ్యవస్థలు ఏర్పడ్డాయని.. వాటిని గౌరవించాల్సిన బాధ్యత మన అందరిదని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా సీఎం శాసన సభలో మాట్లాడారు. ‘’గవర్నర్‌ ప్రసంగం లేకుండానే 2022 బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభించారు. 2023లోనూ గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభించాలనుకున్నారు. కోర్టు కఠినంగా వ్యవహరించడంతో గవర్నర్‌ ప్రసంగానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. రాజ్యాంగ స్ఫూర్తితోనే వ్యవస్థలు ఏర్పడ్డాయి. వాటిని మనం గౌరవించాలి. ప్రభుత్వాలు వ్యక్తుల ఆస్తులు కాదు. బలహీన వర్గాలకు చెందిన మహిళా గవర్నర్‌ను గత ప్రభుత్వం అవహేళన చేసింది. మంత్రివర్గం ఆమోదించిన అంశాలనే ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు. మాది కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఇది ప్రజా పాలన. మా విధానం. మా ఆలోచనలు.. మేం ప్రజలకు చేసిన పనులు మాత్రమే గవర్నర్‌ ప్రసంగంలో పొందుపరుస్తాం. అవగాహన లేని వాళ్లు మంత్రులుగా చేశామని చెప్పుకోవడానికి అర్హత ఉందా? అని నేను అడుగుతున్నాను. పదేళ్ల భారాస పాలనలో నాటి మంత్రివర్గం ఆమోదం లేకుండానే గవర్నర్‌ ప్రసంగం ఉందా?వాళ్లకు గవర్నర్‌ వ్యవస్థపై నమ్మకం లేదు. మహిళా గవర్నర్‌ను అవమానించారు.. ఆ తప్పు మేం చేయం. గవర్నర్‌ వ్యవస్థను గౌరవించే బాధ్యత మాది. గవర్నర్‌ ప్రసంగంలో సూచనలు చేస్తే ప్రభుత్వం స్వీకరిస్తుంది’’ అని రేవంత్‌ అన్నారు.‘’రైతుల సమస్యల శాశ్వత పరిష్కారానికి రైతు కమిషన్‌ వేశాం. చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇచ్చేందుకు గల్లీ నుంచి దిల్లీ వరకూ కొట్లాడుతున్నాం. ఆనాడు అధికార పార్టీగా భారాసకు స్ట్రేచర్‌ ఉండేది. 2023లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజలు స్ట్రేచర్‌ ఇచ్చారు. 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో గుండుసున్నా ఇచ్చి మార్చురీకి పంపించారు. భారాస నేడు మార్చురిలో ఉందని నేను చెప్పాను. అందులో తప్పేముంది. పెద్దాయన కేసీఆర్‌ను నేను అన్నట్లుగా కేటీఆర్‌, హరీశ్‌రావు చిత్రీకరించారు. అంత కుంచిత స్వభావం నాకు లేదు. కేసీఆర్‌ వద్ద ఉన్న కుర్చీని 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు గుంజుకుని నన్ను కూర్చోబెట్టారు. చంద్రశేఖర్‌ రావు వద్ద తీసుకోవడానికి ఇంకేముంది. వారి వద్ద ఉన్నది ప్రధాన ప్రతిపక్ష హోదా.. ఆ హోదా కేటీఆర్‌ లేదా హరీశ్‌రావుకు కావాలి. తప్పుడు మాటలు నాకు ఆపాదిస్తున్నారు. కేసీఆర్‌ వందేళ్లు ఆయురారోగ్యాలతో ప్రతిపక్షంలోనే ఉండాలి.. నేను ఇక్కడే ఉండాలి. కేసీఆర్‌ సూచనలు చేస్తూనే ఉండాలి.. నేను మంచి పరిపాలన అందిస్తూనే ఉండాలి’’ అని సీఎం అన్నారు. పదేళ్ల భారాస పాలనలో రైతులకు జరిగిన సంక్షేమం, అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం ప్రకటించారు.

2.జర్నలిస్టులంటే నిర్వచనం తేల్చేస్తాం
` నోటికొచ్చింది మాట్లాడి.. పోస్టులు పెడితే తోడ్కలు తీస్తా
` సోషల్‌ మీడియాలో తనపై ఇష్టారీతిన పోస్టులపై సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్‌,మార్చి15(జనంసాక్షి):గత కొన్ని రోజులుగా ‘భూ భారతి’ పేరుతో తనపై సోషల్‌ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టిన అంశంపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్ర అసహనానికి గురయ్యారు.భూభారతిని తీసుకొచ్చి పేదల భూములను పేదలకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నందుకు తనపై కోపం పెంచుకుంటున్నారా? అని ధ్వజమెత్తారు. అసలు తనపై అక్కసు వెళ్లగక్కాల్సిన అవసరం ఏమొచ్చిందని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించారు.‘’పెయిడ్‌ ఆర్టిస్టులను తీసుకొచ్చి పార్టీ ఆఫీసులో పెడుతున్నారు. వాళ్లు రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పెడితే పోలీసులు కేసు పెట్టారు. వారు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన భాషను ఒకసారి చూడండి. అసలు జర్నలిస్టు అంటే ఎవరు?అని ఈ సందర్భంగా నేను అడగాలనుకుంటున్నా. ఎవరు పడితే వాళ్లు ఒక ట్యూబ్‌ (ఛానెల్‌) పట్టుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడితే వాళ్లు జర్నలిస్టులు అవుతారా? వాళ్లు వాడే భాష చూస్తే రక్తం మరిగిపోతోంది. ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ఓపిక పడుతున్నాం. కుటుంబసభ్యులను అంతేసి మాటలు అంటుంటే.. అసలు మీరు మనుషులేనా? మీకు భార్యాబిడ్డలు, తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో.. చెల్లినో.. భార్యనో.. ఈ రకంగా మాట్లాడితే నువ్వు వింటావా?’’‘’నా భార్యను, బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది. ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే మీకు నొప్పి రాదా? ఏ సంస్కృతిలో ఉన్నామని నేను అడుతున్నా. ముఖ్యమంత్రిగా చెబుతున్నా.. ఒక్కొక్కరి తోడ్కలు తీస్తా. ప్రజా జీవితంలో ఉన్న మా గురించి మాట్లాడండి.. విమర్శించండి. అంతేకానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్లపై మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది. నోటికొచ్చింది మాట్లాడి.. వాటిని సోషల్‌ మీడియాలో పోస్టు చేయించడం ఏ పైశాచిక ఆనందం. వాళ్లు తిట్టిన తిట్ల చోట నా పేరు తీసేసి మీ పేరు రాసుకొని వినండి. అవి విన్నాక అన్నం తినబుద్ధి అవుతుందేమో చూడండి’’ అని సీఎం అసహనం వ్యక్తం చేశారు.

 

రెండోసారీ నేనే సీఎంని..
` నాడు బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేస్తే నేడు చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయి
` మీడియాతో సీఎం రేవంత్‌ రెడ్డి
హైదరాబాద్‌,మార్చి15(జనంసాక్షి):రెండో సారి కూడా తానే ముఖ్యమంత్రి అవుతానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శాసనమండలి వాయిదా అనంతరం ఆయన విూడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘మొదటి సారి భారాసపై వ్యతిరేకతతో ఓటు వేశారు. రెండో సారి మా విూద నమ్మకంతో ప్రజలు ఓటేస్తారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తా. ఇచ్చిన ప్రతి హావిూ అమలుచేసి ప్రజల వద్దకు వెళతాం. సంక్షేమ పథకాల లబ్దిదారులే మా ఓటర్లు అని అన్నారు. నేను పనిని నమ్ముకొని ముందుకు వెళ్తున్నా. ఇచ్చిన ప్రతి హావిూని నిలబెట్టుకుంటాం. స్టేచర్‌ కాదు స్టేట్‌ ఫ్యూచర్‌ నాకు ముఖ్యం అన్నారు.. 25 లక్షల మందికిపైగా రైతులకు రుణమాఫీ జరిగింది. కోటి మంది మహిళలకు కచ్చితంగా లబ్ది చేకూరుస్తాం. వారంతా ఇప్పుడు మాట్లాడకపోయినా ఓటు మాకే వేస్తారు. గతంలో నేను చెప్పింది జరిగింది.. భవిష్యత్‌లోనూ నేను చెప్పిందే జరుగుతుంది. రిటైర్డ్‌ ఉద్యోగుల బకాయిలు త్వరలో చెల్లిస్తాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలోపు వందశాతం బకాయిలు చెల్లిస్తాం. ఆదాయాన్ని పెంచి..పేదలకు పంచడమే మా విధానం‘ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. చ్చిన ప్రతి హావిూ అమలు చేసి ప్రజల వద్దకు వెళతానని ఆయన శాసనమండలిలో విూడియాతో ముచ్చటించిన సందర్భంలో అన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని రేవంత్‌ చెప్పారు. . తాను పనిని నమ్ముకుని ముందుకు వెళుతున్నానని, సంక్షేమ పథకాల లబ్దిదారులే తమ ఓటర్లని సీఎం రేవంత్‌ అన్నారు. ఇప్పుడు ప్రజలు తనను నమ్మి మళ్లీ గెలిపిస్తారని రేవంత్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి శాయశక్తుల కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణలో కోటి మంది మహిళలకు కచ్చితంగా లబ్ది చేకూరుస్తానని సీఎం హావిూ ఇచ్చారు. మహిళలు ఇప్పుడు మాట్లాడకపోయినా ఓటు తమకే వేస్తారని సీఎం నమ్మకంగా చెప్పారు. గతంలో తాను చెప్పిందే జరిగిందని, భవిష్యత్‌?లో కూడా తాను చెప్పిందే జరుగుతుందని రేవంత్‌ చెప్పారు. జనాభా లెక్కలపై కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ అంచనాలు అడిగిందని, 2027లో జనాభా లెక్కలు నోటిఫై చేస్తారని అంటున్నారని సీఎం రేవంత్‌ తెలిపారు. దక్షిణాది రాష్టాల్రు నష్టపోకుండా ప్రయత్నిస్తున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. తొలిసారి బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకతతో ప్రజలు తమకు ఓటేసినా, రెండోసారి తమపై ప్రేమతో ఓటు వేస్తారని సీఎం రేవంత్‌ చెప్పడం గమనార్హం.