కృష్ణా జలాల్లో తెలంగాణా వాటాను వదులుకోం

` ఈ విషయమై కేంద్రం వద్ద పోరాడుతున్నాం
` ఆంధ్రా ప్రాజెక్టులకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లపాటు తోడ్పాటునందించింది
` రాయలసీమ ఎత్తిపోతల పధకమే అందుకు నిదర్శనం
` కృష్ణా జలాశయాలను పరిరక్షిస్తాం :మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి):కృష్ణా జలాశయాల్లో తెలంగాణా వాటాను వదులు కునే ప్రసక్తే లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తేల్చిచెప్పారు.న్యాయమైన వాటా కోసం కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు శనివారం రాష్ట్ర శాసనసభలో బి.ఆర్‌.ఎస్‌ సభ్యుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి లేవనెత్తిన అంశంపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు.ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అనుగుణంగా పదేళ్ల పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వం తోడ్పాటు నందించిందని ఆయన మండిపడ్డారు. కృష్ణా జలాల పంపిణీలో ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వానికి నాటి బి.ఆర్‌.ఎస్‌ పాలకులు పూర్తిగా సహకరించారని,811 టి.యం.సి ల నీటిలో ఆంద్రప్రదేశ్‌ కు 511 టి.యం.సి లు తెలంగాణా కు 299 టి.యం.సి లను కేటాయించిన రోజునే బి.ఆర్‌.ఎస్‌ నిర్వహకం బట్ట బయలు అయిందని ఆయన ఎద్దేవా చేశారు.పైగా కృష్ణా బేసిన్‌ లో ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రాజెక్టు లు నిర్మిస్తుంటే వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆయన దుయ్యబట్టారు.రాయలసీమ ఎత్తిపోతల పధకం అందుకు నిదర్శనమన్నారు కృష్ణా జలాశయాలలో తెలంగాణాకు జరిగిన అన్యాయంపై ఆయన గణాంకాలతో వివరించారు. కే. ఆర్‌.యం.బి లెక్కల ప్రకారం 2014 లో బి.ఆర్‌.ఎస్‌ పార్టీ పాలనా పగ్గాలు చేపట్టిన రోజు నుండి 2021 వరకు కృష్ణా జలాశయాలలో ఆంద్రప్రదేశ్‌ 64 శాతం వినియోగిస్తే తెలంగాణా కేవలం వాడుకున్న నీటి శాతం కేవలం 36 శాతం మాత్రమే నన్నారు.బి.ఆర్‌.ఎస్‌ పాలకుల పాలనలో ఇదే కృష్ణా జలాశయాలలో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులెటర్‌ కు 44,000 క్యూసెక్కుల నుండి 2023 నాటికి 92,600 క్యూసెక్కుల పెంచుకున్నారని,అదే విదంగా ఆర్‌.ఎల్‌.ఐ. సి,వెలిగొండ ప్రాజెక్టు ల నిర్మాణాన్ని అడ్డుకోలేక పోయారని ఆయన విమర్శించారు.ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాలు తెలంగాణా లోని కల్వకుర్తి, నెట్టేంపాడు,పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు లపై తీవ్ర ప్రభావం చూపయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.బి.ఆర్‌.ఎస్‌ పాలనలో జరిగిన పోరపాట్లను సరిదిద్డేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కేంద్రం దగ్గర పోరాడుతుందన్నారుఉభయ రాష్ట్రాలలో ఎవరు ఎంత నీరు వినియోగిస్తున్నారో అన్నది తెలుసుకునేందుకు వినియోగించాల్సిన టెలిమెట్రి పరికరాలను అమర్చడంలో కూడా బి.ఆర్‌.ఎస్‌ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆయన ఆరోపించారు ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం టెలిమెట్రి పరికరాలను అమర్చేందుకు నిర్ణయం తీసుకుందని ఇండకయ్యే ఖర్చులో ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం తన వాటా మొత్తాన్ని ఇవ్వక పోయిన తెలంగాణ ప్రభుత్వం సొంత నిధులతో ఏర్పాటు చెయ్య బోతున్నట్లు ఆయన వెల్లడిరచారు. అంతే గాకుండా కృష్ణా జలాశయాలలో తెలంగాణా వాటాను తేల్చేందుకు కేంద్రవద్ద పోరాడు తున్నామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు.