కల్మాడీ అధ్యక్షతన ఏషియన్ అథ్లేటిక్స్ అసోషియేషన్ సమావేశం

పుణె: పుణెలో ఆదివారం నుంచి రెండు రోజుల పాటు జరుగుతున్న ఏషియన్ అథ్లెటిక్స్ అసోషియేషన్ కీలక సమావేశలకు సురేశ్ కల్మాడీ అధ్యక్షత వహిస్తున్నారు. కామన్‌వెల్త్ గేమ్స్ కుంభకోణంలో ఇరుక్కున్న కల్మాడీ ఈ అసోషియేషన్‌కు మూడు సార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. నాలుగో దఫా ఆయన ఎన్నికపై ప్రస్తుత సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఈ సారి ఖతార్ అథ్లెటిక్ అసోషియేషన్‌కి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. జులై 3 నుంచి ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీిలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
            
              


