కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు.

నెరడిగొండడిసెంబర్12(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో అమ్మాయిల పెళ్లిళ్లకు తల్లిదండ్రులకు భారం కాకూడదని సీఎం కేసీఆర్ కుటుంబ పెద్దగా కల్యాణ లక్ష్మీ పథకం ప్రవేశ పెట్టారని, మహిళలకు రైతులకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరేనని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. సోమవారం రోజున మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశం మందిరంలో నిర్వహించిన కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.21మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ,సాది ముబారక్ పథకం ద్వారా మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అందులో భాగంగా పేద ఆడపడుచుల పెళ్లి ఘనంగా చేసుకోవడానికి కల్యాణ లక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే అన్నారు.కేసీఆర్ పైన బీజేపీ నాయకులు లేనిపోని అబద్ధాలు ఆరోపణలు చవకబారిన మాటలు నమ్మవద్దని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోపాటు మండల ఎంపీపీ రాథోడ్ సజన్ వైస్ ఎంపీపీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దావుల బోజన్న తెరాస పార్టీ మండల కన్వీనర్ శివారెడ్డి తహసీల్దార్ పవన్ చంద్ర ఇంచార్జి ఎంపీడీఓ శోభన వివిధ గ్రామ సర్పంచ్లు మాజీ జడ్పీటీసీలు గడ్డం భీంరెడ్డి పండరీ పార్టి సీనియర్ నాయకులు నారాయణ్ సింగ్ పీఏసీఎస్ చైర్మన్ మందుల రమేశ్ ఎంపీటీసీలు మండల నాయకులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.