కల్వర్టుకు శంకుస్థాపన చేసిన మంత్రి

ఘట్కేసర్ జూన్ 27( జనం సాక్షి) ఈ రోజు ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో 23 లక్షల నిధులతో చిట్టెరు కుంట నూతన కల్వర్టు మరియు నూతన రోడ్డు నిర్మాణ పనులకు కొరకు మున్సిపాలిటీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు చామకూర మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ సంధర్భంగా చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో గత సంవత్సరం లో భారీగా కురిసిన వర్షాలకు ఎదులబాద్ రోడ్ నందు ఉన్న చెట్టేరు కుంట చెరువు కట్ట నీటి ప్రవాహానికి తెగిపోయింది. దాని వలన ఘట్కేసర్ మున్సిపాలిటీ ప్రజలకు అదేవిధంగా ఘట్కేసర్ చుట్టూ ప్రక్కన ఉన్న గ్రామాల ప్రజలకు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అదేవిధంగా నిత్యం ఎం ఆర్ వో కార్యాలయానికి వచ్చే ప్రజలకు అధికారులకు కూడా రావడానికి పోవడానికి తీవ్ర అంతరాయం కలుగుతుంది అని కార్మిక శాఖ మంత్రివర్యులు చామకూర మాల్లారెడ్డి సహకారంతో గత కొంత కాలంగా ఆర్ అండ్ బి మరియు ఇరిగేషన్ అధికారులతో చర్చించి త్వరలో వర్షాలు పడినప్పుడు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కల్వర్టు ప్రక్కన నూతన కల్వర్టు ఏర్పాటు చేసి దాని మీదుగా నూతన బి టి రోడ్ వేసి ప్రజలకు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు చందుపట్ల వెంకట్ రెడ్డి, కొమ్మగోని రమాదేవి, మహిపల్ గౌడ్, బొక్క సంగీత, ప్రభాకర్ రెడ్డి,బండారు ఆంజనేయులు గౌడ్, కడుపొల్ల మల్లేష్, బేతల నర్సింగ్ రావు, కుతాది రవీందర్,కో-ఆప్షన్ సభ్యులు బొట్టు అరుణ కృపనిది,బొక్క సురేందర్ రెడ్డి, SK షౌకత్ మియా,ప్రదాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ ముదిరాజ్,బ్యాంకు డైరెక్టర్ చందుపట్ల ధర్మారెడ్డి, ఆలయ డైరెక్టర్ మెరుగు నరేష్ గౌడ్, బీసీ అధ్యక్షుడు బర్ల హరి శంకర్,మాజీ ఎంపీటీసీ గోపాల్ రెడ్డి, నర్సింగ్ రావు, వెంకట నారాయణ, బొక్క కృష్ణ రెడ్డి ,రొడ్డ యాదగిరి , మాజీ వార్డు సభ్యులు శివయ్య , విమల , పోతాకని రాజు , బొక్క విష్ణు , పల్లె విజయ్ , ఫాయుమ్ , పిట్ల విజయ్ ముదిరాజ్ గారు, నిఖిల్ , జగదీష్ , కడుపొల్ల రాజు , మధు , కడుపొల్ల నరేష్ , ఆర్ అండ్ బి అధికారులు, ఇరిగేషన్ అధికారులు, మునిసిపల్ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు…

తాజావార్తలు