కళాశాల భవన పనులకు శ్రీకారం

ముస్లింలకు తోఫా అందించిన మంత్రి 
వికారాబాద్‌,మే31(జ‌నం సాక్షి): వికారాబాద్‌లో రూ.2 కోట్లతో సంగెం లక్ష్మీబాయి గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్‌ కళాశాల నూతన భవనం నిర్మాణం పనులను మంత్రి మహేందర్‌ రెడ్డి  ప్రారంభించారు.  వికారాబాద్‌ జిల్లాలో రవాణా శాఖ మంత్రి గురువారం  పర్యటించారు. పర్యటనలో భాగంగా మంత్రి మహేందర్‌ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం కోట్‌పల్లి మండలం మోత్కుపల్లిలో రూ.57 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.  ఇదిలావుంటే తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలను కేటాయించిందని రవాణ శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి తెలిపారు. వికారాబాద్‌ లో పేద ముస్లింలకు ప్రభుత్వం ఇస్తున్న రంజాన్‌ బహుమతిని మహేందర్‌ రెడ్డి అందజేశారు. కొత్తబట్టలతో పాటు ఇఫ్తార్‌ విందుల ఏర్పాటుకు నిధులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లాలో 10 వేల మంది పేద ముస్లింలకు దుస్తుల కిట్స్‌ ను అందజేస్తున్నామన్నారు. ఇఫ్తార్‌ దావత్‌ ల కోసం జిల్లాకు ఐదు లక్షల రుపాయల నిధులను కేటాయించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కొండల్‌ రెడ్డి, రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాలు సంస్థ చైర్మన్‌ నాగేందర్‌ గౌడ్‌ ,జడ్పీటీసీ షరీఫ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రామచంద్రారెడ్డి, శుభప్రద్‌ పటేల్‌ తదితరులు పాల్గొన్నారు.