కళ్ల ఎదుటే కన్న తల్లి గిల గిలా కొట్టుకుని ప్రాణాలు విడుస్తుంటే… తల్లడిల్లిన తనయుడు

తనకు జన్మనిచ్చిన తల్లి తన కళ్ల ఎదుటే విగత జీవిగా మారిపోవడాన్ని ఏ కన్న కొడుకు తట్టుకోలేడు. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒక కొడుక్కి జరిగింది. అంతసేపు తనతో మాట్లాడుతూ తన వెనుకే కూర్చుని ఉన్న తల్లి కళ్ళఎదుటే ట్రాక్టర్ ఢీకొని మరణించడం.. అంత సేపు ఆమె చెప్పిన మార్గదర్శకాలే తనకు చివరి మాటలు కావడంతో ఆయన తనయుడు తల్లడిల్లిపోయాడు. శ్రీకాకుళంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
మంగళవారం హుకుంపేట నుంచి భావనపాడు వెళ్లేందుకు తన కుమారుడు కొమర శంకరరావుతో కలిసి హీరో హోండా ద్విచక్రవాహనంపై కొమర చంద్రావతి(49) బయలుదేరింది. దారి పొడవునా కుమారుడు వాహనం నడుపుతుంటే కుటుంబ పరిస్థితి, నడుచుకోవాల్సిన తీరుపై ఆయనకు హితభోద చేస్తూ వస్తోంది చంద్రావతి. అయితే మండలంలోని రెయ్యిపాడు వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ట్రాక్టరు ఢీకొంది. దీంతో కుమారుడు ఎగిరి అవతల పడ్డాడు.
తల్లి చంద్రావతి మాత్రం టాక్టర్ కింద పడడం వెంటనే ఆమె తలపై నుంచి చక్రవెళ్ళడంతో నుజ్జు నుజ్జు అయ్యింది. ఇదంత చూస్తున్న కుమారుడు శంకర్రావు అమ్మా.. అమ్మా.. అంటుండగానే ఆమె తల నుజ్జు నుజ్జు అయి ఆమె శరీరం గిలగిల కొట్టుకోవడం చూసి ఆయన తల్లడిల్లిపోయాడు. వాహనాన్ని శంకరరావుకు కూడా స్వల్పగాయాలైయ్యాయి. శంకరరావు ఫిర్యాదు మేరకు వజ్రపుకొత్తూరు పోలీసులు శవ పంచనామా నిర్వహించి, పోస్టు మార్టం కోసం మృత దేహాన్ని పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.