కష్టజీవుల పోరాట యోధుడు మచ్చలేని మహా నాయకుడు కామ్రేడ్ ఓంకార్
అవినీతిలో ఆరితేరిన బూర్జువా పాలక పార్టీలు
ఏఐకెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్
ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో ఘనంగా కామ్రేడ్ ఓంకార్ 14వ వర్ధంతి.
జనం సాక్షి నర్సంపేట
కష్టజీవుల పక్షాన పోరాడి నిరంతరం దోపిడీకి వ్యతిరేకంగా నిలబడిన మచ్చలేని మహా నాయకుడు కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ అని ఆయన ఆశయసాదని నేటి ప్రజా సమస్యలకు పరిష్కారం అని ఏఐకెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్, ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కన్నం వెంకన్న అన్నారు.
ఈరోజు తెలంగాణ రైతంగ సాయుధ పోరాట యోధుడు, ఎంసిపిఐ(యు) వ్యవస్థాపకులు, అసెంబ్లీ టైగర్ అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ 14వ వర్ధంతిని నర్సంపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. అంగడి సెంటర్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ కష్టజీవుల కోసం పనిచేస్తూ ఎన్నికల్లో నిలబడితే ప్రజలే స్వచ్ఛందంగా ఎన్నికల ఖర్చులకోసం నిధులు సమకూర్చి గెలిపించారని ఈ క్రమంలో ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా నీతి నిజాయితీగా అండగా నిలబడి సమస్యల పరిష్కారం కోసం ఎంతకైనా తెగించారని అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని తన సర్వస్వాన్ని ప్రజా ఉద్యమాలకు త్యాగం చేశారని అలాంటి మహా నాయకుడు లేని లోటు పూడ్చలేనిదని కానీ నేటి బూర్జువా పాలక పార్టీలు ప్రజల్ని ప్రజలకు చెందాల్సిన సంపదను దోచుకునేందుకు ఎన్నికల్లో గెలవడానికి అనేక అవినీతి అక్రమాలకు ప్రలోభాలకు పాల్పడుతూ నీచాతి నీచమైన పనులు చేస్తున్నారని అందుకు ప్రత్యక్ష ఉదాహరణ మునుగోడు ఉప ఎన్నిక అని డబ్బులు మద్యం ఏరులై పారిస్తూ ప్రజలను మభ్యపెట్టి గెలిచేందుకు ప్రయత్నిస్తూ రాజకీయ పబ్బం పొందేందుకు శతవిధాల కృషి చేస్తున్నారని ఇది భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టని ఆందోళన వ్యక్తం చేశారు.
కరిగిపోతున్న ప్రజా సంపదలను పెరిగిపోతున్న భారాలను అడ్డుకునేందుకు కామ్రేడ్ ఓంకార్ చూపిన బాట ఏకైక మార్గమని ఆ దిశలో ఆలోచించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజా సాహెబ్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాగసుధ డివిజన్ సహయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి జిల్లా కమిటీ సభ్యులు కేశెట్టి సదానందం దామ సాంబయ్య హనుమాన్ల రమేష్ బిందు ఈర్ల రాజు రతన్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area