కష్టపడండి… అండగా ఉంటా

– బూత్‌ కమిటీ నాయకులకు చందర్‌ విజ్ఞప్తి
గోదావరిఖని, నవంబర్‌ 11, (జనంసాక్షి) :
బూత్‌ లెవల్‌ స్థాయిలో ప్రతి ఓటరును కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించాలని, ఈ ఒక్కసారి కష్టపడితే తాను ఎమ్మెల్యేగా గెలుస్తానని, అండగా ఉంటానని ఉద్యమ నేత, టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థి కోరుకంటి చందర్‌ విజ్ఞప్తి చేశారు. ఆదివారం స్థానిక మార్కండేయకాలనీలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాల్‌లో  ఏర్పాటు చేసిన బూత్‌ కమిటి నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బూత్‌ కమిటి నాయకులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రత్యర్థులు రూ.కోట్లు కుమ్మరించడానికి సిద్దమవుతున్నారని అన్నారు. ప్రతి ఓటరును కలిసి తాను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పలు విషయాలను వివరించాలని కోరారు. అదే విధంగా ఈ నెల 14న ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా నామినేషన్‌  వేస్తున్నానని, కార్పొరేషన్‌ పరిధిలోని 50 డివిజన్ల నుంచి అధిక సంఖ్యలో మహిళలు, పురుషులు తరలివచ్చి తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు పాతపెల్లి ఎల్లయ్య, నారాయణదాసు మారుతి, తోడేటి శంకర్‌గౌడ్‌, పిల్లి రమేశ్‌, అచ్చ వేణు, కుమ్మరి శ్రీనివాస్‌, మెతుకు దేవరాజు, బొడ్డు రవీందర్‌, చెలుకలపల్లి శ్రీనివాస్‌, నూతి తిరుపతి, బొడ్డుపల్లి శ్రీనివాస్‌, సిరాజుద్దీన్‌, బిక్కినేని నర్సింగారావు, ముడుతనపల్లి సారయ్య, అనుముల కళావతి, బొమ్మగాని తిరుపతిగౌడ్‌, డివిజన్‌ ఇంచార్జీ తదితరులు పాల్గొన్నారు.