కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలి ఎంపీపీ శరత్ రావు

ముస్తాబాద్ జూన్ 2 జనం సాక్షి

తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో   ముస్తాబాద్ మండల కేంద్రంలో యువతీ, యువకులు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో ముస్తాబాద్ లో గత కొన్ని రోజులుగా కేటీఆర్ కోచింగ్ సెంటర్ ప్రారంభించి ఎంపీపీ జనగామ శరత్ రావు  ఆధ్వర్యంలో కోచింగ్ ఇప్పిస్తున్నారు. అందులో భాగంగా ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు శిక్షణ తీసుకుంటున్న యువతీ, యువకులకు ముస్తాబాద్  నందు  ఎంపీపీ జనగామ శరత్ రావు  సందర్శించి సలహాలు సూచనలు చేశారు. నిపుణులైన విద్యను చెప్పే అధ్యాపకులను హైదరాబాద్ నుండి తీసుకువచ్చి వారి ద్వారా యువతీ,యువకులకు సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు రాణించే  విధానంపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుండం నర్సయ్య ,సర్పంచ్ గాండ్ల సుమతి ,సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్యా ,మాజీ జిల్లా కో ఆప్షన్ మెంబెర్ సర్వర్ పాషా గారు,షాదుల్ పాపా గారు,తెరాస మండల అధ్యక్షుడు సురేందర్ రావు గారు,తెరాస సీనియర్ నాయకులు చెవుల మల్లేష్ ,కంచం నర్సింలు కానిస్టేబుల్ బాల శ్రీనివాస్ నాయకులు పాల్గొన్నారు