కష్టించి పనిచేస్తేన ఫలితాలు.. జిల్లాకలెక్టర్
వనపర్తి (జనం సాక్షి) ప్రతిరోజు చేసేపనిలో ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు వెళ్ళిన నాడు ఆశించిన ఫలితాలు సాధించవచ్చని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అన్నారు.
గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో వనపర్తి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా తెలంగాణ రెవిన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు సన్మానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చేసేపనిలో నిబద్ధత ఉండాలని, కష్టపడి పనిచేస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయని ఆమె తెలిపారు. జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తిచేశామని, ధరణిలో సమస్యలను పరిష్కరించగలమని ఆమె వివరించారు. వనపర్తి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పథకాల అమలులో ముందు స్థానంలో ఉన్నామని జిల్లా కలెక్టర్ సూచించారు.
అనంతరం తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ 2022 సం. క్యాలెండర్ ను ఆమె ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్, డి ఆర్ డి ఓ నరసింహులు, డీఎంహెచ్వో చందు నాయక్, కలెక్టరేట్ సిబ్బంది, మధు, తిలక్, మల్లికార్జున్, ఈ.డి.ఎం. వినోద్ కుమార్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.