కసబ్‌కు ఉరిశిక్ష అమలు ఎరవాడ జైలులో ఉరితీత అత్యంత రహస్యంగా పూర్తి

పాక్‌కు సమాచారమిచ్చిన కేంద్ర ప్రభుత్వం

మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు నిరాకరణ

జైలులోనే ఖననం

ముంబై, నవంబర్‌ 21 :ముష్కర మూకలకు హెచ్చరిక. తమపై దండెత్తితే ఏమవుతుందో భారత్‌ చేసి చూపింది. ముంబైలో మారణ¬మానికి పాల్పడిన మహమ్మద్‌ అజ్మల్‌ అవిూర్‌ కసబ్‌ను ఉరి తీసి ఉగ్రవాదులకు గట్టి హెచ్చరిక పంపింది. ఎంతటి వారైనా శిక్ష తప్పదని మరోమారు స్పష్టం చేసింది. మరో ఐదు రోజులైతే ముంబై మారణ ¬మానికి నాలుగేళ్లు పూర్తవుతాయనగా.. కసబ్‌ను ఉరితీయడం విశేషం. ముంబై దాడుల కేసులో సజీవంగా పట్టుబడ్డ ఏకైక ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌కు న్యాయస్థానం విధించిన ఉరిశిక్షను బుధవారం అమలు

చేశారు. ఎరవాడ జైలులో బుధవారం 7.30 గంటలకు ఉరితీశారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు పాకిస్తాన్‌ ప్రభుత్వం, అతని కుటుంబ సభ్యులు నిరాకరించడంతో.. జైలులోనే ఖననం చేశారు.

క్షమాభిక్ష ప్రసాదించాలని కసబ్‌ పెట్టుకున్న పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ నవంబర్‌లో తిరస్కరించడంతో ఆయనకు ఉరి ఖాయమైంది. ఉరితీత ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం అత్యంత రహస్యంగా నిర్వహించింది. ఉరి అమలుపై పాక్‌కు ముందే సమాచారమిచ్చిన ప్రభుత్వం అక్కడి నుంచి స్పందన రాకపోవడంతో నవంబర్‌ 21న ఉరి తీయాలని ముహూర్తం నిర్ణయించింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపింది. కేంద్ర ఆదేశాలతో జైలు అధికారులు ముంబైలోని ఆర్థర్‌ రోడ్‌ జైలులో ఉన్న కసబ్‌ను రెండ్రోజుల క్రితం రహస్యంగా పుణెలోని ఎరవాడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షలు సహా మిగతా ప్రక్రియలు అన్ని ముగిసిన అనంతరం కసబ్‌ను ఉరి తీశారు. జైలు మాన్యువల్‌ ప్రకారం విధివిధానాలను పూర్తి చేసినట్లు జైలు అధికారులు వెల్లడించారు. ఎరవాడ జైలులో బుధవారం ఉదయం 7.30 గంటలకు కసబ్‌ను ఉరి తీసినట్లు మహారాష్ట్ర ¬ం మంత్రి ఆర్‌ఆర్‌ పాటిల్‌ ప్రకటించారు. అటు కేంద్ర ¬ం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే కూడా దీన్ని ధ్రువీకరించారు.

జైలులోనే ఖననం..

కసబ్‌ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు పాకిస్తాన్‌ ప్రభుత్వం కానీ, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆసక్తి చూపలేదు. పాక్‌కు సమాచారమిచ్చినా.. అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కసబ్‌ మృతదేహాన్ని జైలు అధికారులు ఎరవాడ జైలులోనే ఖననం చేశారు. ముస్లిం సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేశారు. ఉరితీసిన తర్వాత మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించిన కొద్దిసేపటికే.. జైలులో పూడ్చిపెట్టినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చౌహాన్‌ వెల్లడించారు. తప్పు చేసిన ఎంతటి వారికైనా శిక్ష తప్పదని, ఉగ్రవాది కసబ్‌ విషయంలోనూ అదే జరిగిందన్నారు. ఉరిశిక్ష పడిన కసబ్‌ను రెండ్రోజుల క్రితమే ఎరవాడ జైలుకు తరలించినట్లు చెప్పారు.

చివరి కోరిక ఏవిూ లేదన్న కసబ్‌..

చనిపోయే ముందు కసబ్‌ ఎలాంటి కోరిక కోరలేదు. ఉరి తీయడానికి ముందు చివరి కోరిక ఏమైనా ఉందా? అని జైలు అధికారులు ప్రశ్నించగా.. ఏమి లేదని చెప్పాడు. విచారణ సమయంలో పిచ్చి పిచ్చి కోరికలు కోరిన కసబ్‌.. చివరి ఘడియల్లో ఎలాంటి కోరిక కోరక పోవడం గమనార్హం. విచారణ సమయంలో తనకు బిర్యానీ తినాలని ఉందని, బాలీవుడ్‌లో నటించాలని ఉందని చెప్పిన కసబ్‌.. చివరి నిమిషంలో మాత్రం ఏవిూ లేదని తెలిపాడు. చివరి కోరిక ఏమైనా ఉందా? అని అడిగితే.. ఏవిూ లేదని కసబ్‌ చెప్పినట్లు జైలు అధికారులు తెలిపారు. జైలు మాన్యువల్‌ ప్రకారం కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తామనగా.. కసబ్‌ ఆసక్తి చూపలేదని వివరించారు. కసబ్‌కు ఉరి శిక్ష అమలు సమాచారాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలపాలని బాంబే హైకోర్టు ఆదేశించిందని, ఈ మేరకు సమాచారం పంపించామని వివరించారు.

చట్ట ప్రకారమే కసబ్‌ను ఉరి తీసినట్లు మహారాష్ట్ర ¬ం మంత్రి ఆర్‌ఆర్‌ పాటిల్‌ తెలిపారు. క్షమాభిక్ష ప్రసాదించేందుకు రాష్ట్రపతి తిరస్కరించడంతో.. కోర్టు ఆదేశాలను అమలు  చేశామని చెప్పారు. ముంబైపై జరిగిన దాడి యావత్తు దేశంపైనే జరిగిన దాడి అని అన్నారు. ముష్కరుల మూకల్లో మృతి చెందిన అమాయకులు, పోలీసులు, భద్రతా బలగాలను నిజమైన ఇది నివాళి అని పేర్కొన్నారు.