కసబ్ ఉరిపై పాకిస్థాన్ మీడియా
ఢిల్లీ: ఉగ్రవాది కసబ్ ఉరితీతపై పాకిస్థాన్ వెబ్ పత్రికలు ఆచితూచి వార్తలను ప్రచురించాయి. ఆ వార్తకు ఎవరూ కూడా అధిక ప్రాధాన్యం ఇవ్వలేదు. పాకిస్థాన్ ప్రధాన వార్తా ఛానల్ జియో టీవీ వెబ్‌సైట్లో ‘ ఇండియా హ్యాంగ్స్ ముంబయి గన్‌మ్యాస్ అజ్మల్ కసబ్ ‘ అని రాసింది. కసబ్‌ను ఉరితీసినట్లుగా భారతీయ మీడియా ప్రచురించిందని మరో పత్రిక డాన్, కామ్ పేర్కొంది. అన్ని వెబ్ పత్రికలూ కూడా… ముంబయి దాడిలో పట్టుబడ్డ ఏకైన గన్‌మ్యాస్ కసబ్‌ని భారత్ ఉరితీసిందని, అతని క్షమాభిక్ష దరఖాస్తును భారత రాష్ట్రపతి ఇటీవల తిరస్కరించారని. క్లుప్తంగా ఈ వార్తను ప్రచురించడం గమనార్హం. ఉదయం పదిన్నరకు కూడా పలు వెబ్ పత్రికలు ఈ వార్తను అసలు ప్రచురించలేదు.