కస్తూరిబా గాంధీ హాస్టల్‌కు వాటర్ ఫిల్టర్ బహూకరణ
వేములవాడ, జూన్-17, (జనంసాక్షి):
వేములవాడలోని మార్కండేయనగర్‌లో గల కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలకు యాదవ యువసేన అధ్వర్యంలో ఆదివారం రోజున వాటర్ ఫిల్టర్‌ను బహుకరించి, విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈ.ఓ. నందగిరి రాజేంద్రశర్మ, వేములవాడ నియోజ కవర్గం యాదవ సంఘం అధ్యక్షులు జడల రవిందర్ యాదవ్, యాదవ యువసేన అధ్యక్షులు వాసం మల్లేశం యాదవ్, ఆ సంఘం మండల అధ్యక్షులు బండ మల్లేశం యాదవ్, గౌరవాధ్య క్షులు శీలం శ్రీనివాస్ యాదవ్‌లతో పాటు సుమారు 150 మంది యాదవ సంఘ నాయకు లు, కులస్తులు, యువకులు పాల్గొన్నారు.