కాంగ్రెస్‌..ఓ బెయిల్‌ గాడీ

పేరున్న నేతలంతా బెయిల్‌పై తిరుగుతున్నారని వ్యాఖ్య

రాజస్థాన్‌ పర్యటనలో ఎద్దేవా చేసిన ప్రధాని మోడీ

జైపూర్‌,జూలై7(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోమారు తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. పలువురు కాంగ్రెస్‌ నేతలు బెయిల్‌పై తిరుగుతుండడంతో ఆ పార్టీ ఓ ‘బెయిల్‌ గాడీ’ అంటూ వ్యంగ్యాస్త్రం విసిరారు. శనివారం రాజస్థాన్‌లో జరిగిన ఓ ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ… కాంగ్రెస్‌ వీరులుగా పేరున్న చాలామంది నేతలు, మాజీ మంత్రులు ఇప్పుడు బెయిల్‌ విూద తిరుగుతున్నారు. ఆ పార్టీ అసలు సంగతి ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు బెయిల్‌ గాడీ అని పిలవడం మొదలుపెట్టారని వ్యాఖ్యానించారు. 2016లో పీవోకేలో భారత భద్రతా దళాలు జరిపిన సర్జికల్‌ దాడులపై కాంగ్రెస్‌ విమర్శలు చేసిందనీ, భారత ఆర్మీ సామర్థ్యాన్ని ప్రశ్నించిందని దుయ్యబట్టారు. ఇంతకు ముందు సైన్యం ప్రతిభా పాటవాలను ప్రశ్నించిన వారెవరూ లేరనీ… ఇలాంటి రాజకీయాలను ప్రజలు ఎప్పటికీ క్షమించబోరని పేర్కొన్నారు. సైనికులకు వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్సన్‌ సహా అనేక సమస్యలనే తమ ప్రభుత్వం పరిష్కరించిందని ప్రధాని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సిఎం వసుంధర రాజె తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభలో నలుపురంగు దుస్తులు ధరించడంపై రాజస్థాన్‌ పోలీసులు అప్రకటిత నిషేధం విధించారు. రాజస్థాన్‌ రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం జైపూర్‌ నగరంలో జరగనున్న బహిరంగసభలో పాల్గొననున్నారు. ప్రధాని సభలో కొందరు ఆందోళనకారులు నల్లరంగు జెండాలతో నిరసన తెలిపే అవకాశముందని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో నల్ల రంగు దుస్తులు ధరించడంతోపాటు నల్లరంగు వస్త్రాలు కనిపిస్తే చాలు రాజస్థాన్‌ పోలీసులు కలవరపడుతున్నారు. మోదీ సభలోకి నల్లజెండాలను తీసుకువెళ్లేందుకు అనుమతించేది లేదని పోలీసులు అధికారికంగా ప్రకటించారు. మరోవైపు

లుపురంగు దుస్తులు ధరించడంపై ఎలాంటి నిషేధం లేదని పోలీసులు స్పష్టం చేసినా, నలుపురంగు దుస్తులపై అప్రకటిత నిషేధాన్ని అమలు చేస్తున్నారని ప్రజలు చెపుతున్నారు. నలుపురంగు దుస్తులు ధరించడంపై ఎలాంటి నిషేధం లేదు. ప్రజలు ఏ రంగు దుస్తులైనా ధరించే స్వేచ్ఛ ఉంది , కానీ ప్రజలు నల్ల జెండాలు తీసుకొని ప్రధాని సభలోకి రావడానికి మేము అనుమతించం. ఎవరైనా నల్లజెండాలు ప్రదర్శిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని రాజస్థాన్‌ పోలీసు అదనపు డీజీపీ ఎన్నార్కే రెడ్డి హెచ్చరించారు.