కాంగ్రెస్ పార్టీకి ముత్యంరెడ్డి గుడ్‌బై…
రేపు సీఎం కేసీఆర్ సభలో మాజీ మంత్రి చెరుకు మత్యంరెడ్డి చేరిక టిఆర్‌ఎస్ డబుల్ షూటర్, మంత్రి హరీష్‌రావు, దబ్బాక తాజా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిల ముత్యంరెడ్డితో చర్చలు సఫలం టిఆర్‌ఎస్‌లోకి చేరేందుకు ముత్యంరెడ్డి గ్రీన్ సిగ్నల్ సిద్దిపేట బ్యూరో, నవంబర్ 18: దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చెరుకు ముత్యంరెడ్డి టిఆర్‌ఎస్ చేరేందుకు ముహుర్తం ఖరారు అయ్యింది. ఈ మేరకు ఆదివారం మంత్రి హరీష్‌రావు, దుబ్బాక తాజా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిలు తొగుటలోని తన నివాసంలో ముత్యంరెడ్డితో చర్చలు జరిపారు. టిఆర్‌ఎస్‌లో చేరేందుకు ముత్యంరెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల 20న సిద్దిపేటలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభలో ముత్యంరెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరుతారని మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ పెద్దలు సీనియర్ నేత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డితో మాట్లాడటం జరిగిందని, ఆయన మాకు సానుకూలంగా స్పందించారని చెప్పారు. సిద్దిపేట సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుందని తెలిపారు. దుబ్బాక నియోజక వర్గం అభివృద్ది చెందింది అంటే కేవలం చెరుకు ముత్యంరెడ్డి, రామలింగారెడ్డిలతోనని అన్నారు. వీరు ఇద్దరు కలిసి సిద్దిపేట తరహాలో దుబ్బాకను అభివృద్ది చేసారన్నారు. ఇద్దరు కలిస్తే దుబ్బాకలో టిఆర్‌ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. ముత్యంరెడ్డి చేరిక ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రభావితం చూపబోతుందన్నారు. పార్టీలో ముత్యంరెడ్డికి ప్రాదాన్యత ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక తాజా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, టిఆర్‌ఎస్ నేత రొట్టె రాజమౌళి, టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. పోటోరైటప్: 260 సిద్దిపేటలో 20న జరిగే సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీష్‌రావు, మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి సిద్దిపేట బ్యూరో, నవంబర్ 18: ఈ నెల 20న సిద్దిపేటలో జరిగే సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను సిద్దిపేటలోని పత్తి మార్కెట్ యార్డు గ్రౌండ్‌ను ఆదివారం మంత్రి హరీష్‌రావు, దుబ్బాక తాజా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిలు పరిశీలించారు. సభ ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని పార్టీ నేతలను మంత్రి హరీష్‌రావు సూచించారు. కాగా చిన్నకోడూర్ మండలంలోని మేడిపల్లి గ్రామ బిజేపి నేతలు వెంకట స్వామి, రాజిరెడ్డి, కిరన్‌రెడ్డి, చిలువేరు ప్రభాకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డిలు హరీష్‌రావు సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. టిఆర్‌ఎస్ నాయకుడు, కళాకారుడు కళాంజాలి రాజేష్ రూపొందించిన జయభేరి ఆడియో సీడిని మంత్రి హరీస్‌రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మచ్చవేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.