*కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మునికి ఘన నివాళులు*

బయ్యారం, అక్టోబర్2(జనంసాక్షి):
బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతి పిత మహాత్మ గాంధీ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల అధ్యక్షులు కంబాల ముసలయ్య మాట్లాడుతూ…
భారత జాతిపిత మహాత్మాగాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో జన్మించారు అంహిసే ఆయుధంగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి.. దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చిన మహనీయుడు గాంధీ. తెల్లదొరలను తరిమికొట్టేందుకు అప్పట్లో ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులు పోరాడారు. తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు. అయితే, గాంధీ అహింస మార్గంలో ఉద్యమించి బానిస సంకెళ్ల నుంచి దేశానికి విముక్తి కల్పించారు. అందుకే ఆయన జన్మదినాన్ని ఏటా ‘అహింసా దినోత్సవం’గా నిర్వహిస్తున్నారన్నారు. ఆత్మాభిమానం, గౌరవాల్ని వేరెవరో పరిరక్షించరని, మనకు మనమే వాటిని కాపాడుకోవాలంటూ పిలుపునిచ్చి ఎందరినో తన ఉద్యమస్ఫూర్తిని రగిల్చారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బయ్యారం టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ రెడ్డి,రామచంద్రాపురం ఎంపీటీసీ లక్ష్మి (గణేష్ ), మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తగిర నిర్మలా రెడ్డి,ఉప్పలపాడు సొసైటీ డైరెక్టర్ కేతమల్లు, కిసాన్ మండల అధ్యక్షులు తెలబోయిన లింగయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోయగురి రామకృష్ణ రెడ్డి, బాలాజీపేట బూత్ ఇన్రోలర్ బండి యాదగిరి  గౌడ్,జగ్గుతండా గ్రామ కార్యదర్శి బాను నాయక్, దోమకొండ వెంకటేష్వర్లు, తగిర సుదర్శన్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.