కాంగ్రెస్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ లోకి
మర్పల్లి 01 జులై (జనం సాక్షి) మర్పల్లి మండలంలోని బుచన్ పల్లి గ్రామానికి చెందిన 15 మంది కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీ లో చేరారు. శుక్రవారం రోజున వికారాబాద్ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఆవరణలో బుచన్ పల్లి గ్రామ మాజీ ఉపసర్పంచ్ విజేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమిరెడ్డి, లక్ష్మణ్ రావు, మహేందర్, బక్కప్ప, జనార్దన్ రెడ్డి, అశోక్, శ్రీనివాస్, శ్రీకాంత్ 15 మంది వరకు టిఆర్ఎస్ పార్టీలో చేరారు.. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల కోసం అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలను పరిష్కారం చూపుతున్న ఎమ్మెల్యే పనితనం నచ్చి పార్టీలో చేరామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, మధుకర్, తదితరులు పాల్గొన్నారు