కాంగ్రెస్ పార్టీ లోకి పలువురి చేరిక
జనంసాక్షి, మంథని : మంథని నియోజక వర్గం పరిధిలోని మహా ముత్తారం మండలం కనుకనూర్, పోచంపల్లి గ్రామాలకు చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు భూక్యా భాస్కర్, కాక లక్ష్మణ్, బచ్చు నరసింహారావు తదితరులు శనివారం ఏఐసిసి కార్యదర్శి దుద్దుల్ల శ్రీధర్ బాబు సమక్షంలో మంథని క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వీరికి శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కనుకునుర్ ఎంపీటీసీ తోలం వెంకటేశ్వర్లు, కనకనూరు మాజీ సర్పంచ్ అత్కురి పోశయ్య, సీనియర్ నాయకులు నూకల రవి, చెన్నూరి ఎల్లయ్య, బొడిగ రమేష్, రేగ విజయ్, తదితరులు పాల్గొన్నారు