కాంగ్రెస్ పార్టీ వార్ రూం పైన పోలీసులు చేసిన దాడిని ఖండించిన రామావత్ సేవ నాయక్ యువజన కాంగ్రెస్ నాయకులు కొండమల్లేపల్లి
కొండమల్లేపల్లి డిసెంబర్ 15జనం సాక్షి న్యూస్ :
ఈరోజు స్థానిక కొండమల్లేపల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ వ్యూహాకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసుల దాడి ,సీజ్ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ వార్ రూంలో పోలీసుల పెత్తనం ఏంటని వారు ప్రశ్నించారు.
కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తుంటే పోలీసులు ఇలా వ్యవహరించడం దారుణమని వారు పేర్కొన్నారు .ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతుందని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భయంతోనే కార్యాలయంపై దాడి చేయడంతో పాటు భయబ్రాంతులకు గురి చేయడం వంటి చర్యలను ఖండిస్తున్నామని వారు అన్నారు