కాంగ్రెస్ లో చేరిన దౌల్తాబాద్ మాజీ సర్పంచ్ భద్రయ్య.

దౌల్తాబాద్ అక్టోబర్ 9, జనం సాక్షి.
దౌల్తాబాద్ మాజీ సర్పంచ్ మాదంశెట్టి భద్రయ్య శనివారం రోజున హైదరాబాద్ గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. పార్టీలో చేరిన వారు మూచమర్రి కృష్ణ,మధంశెట్టి శివ, కుమ్మరి మల్లికార్జున్,బ్యాగరి రాజు, పెద్దోళ్ల మహేష్,కమ్మరి యాదగిరి, కురుమ కుమార్,స్వామి, గోవిందాపూర్ నరసింహారెడ్డి తదితరులు చేరారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దశరథ రెడ్డి,కర్నాల శ్రీనివాసరావు,బండారు లాలు, ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు.